E-Paper
Advertisement

IPL 2026 Finals: సాయి, గిల్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌.. బెంగ‌ళూరు ల‌క్ష్యం ఎంతంటే ?

IPL 2026 Finals: సాయి, గిల్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌.. బెంగ‌ళూరు ల‌క్ష్యం ఎంతంటే ?
Advertisement

IPL 2026 Finals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్స్ 7:30 గంటలకే ప్రారంభమైంది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్… నిర్ణీత‌ 20 ఓవర్లలో 155 పరుగులు మాత్రమే సాధించగలిగింది. సాయి సుదర్శన్ అలాగే కెప్టెన్ గిల్ అత్యంత దారుణంగా విఫలమయ్యారు. దీంతో తక్కువ స్కోరు మాత్రమే నమోదు చేయగలిగింది గుజరాత్ టైటాన్స్. ఇక ఈ మ్యాచ్ లో 156 ప‌రుగులు సాధిస్తే, ఆర్సీబీ ఛాంపియ‌న్ కానుంది.

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

సాయి, గిల్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌.. బెంగ‌ళూరు ల‌క్ష్యం ఎంతంటే ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ నెగ్గింది. ఈ క్రమంలోనే బెంగళూరు మొదట బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసి బొక్క బోర్లా పడింది. ఈ టోర్నమెంటులో గుజరాత్ టైటాన్స్ జట్టుకు 1000 ఏనుగుల బలంలా ఉన్న సాయి సుదర్శన్ అదే సమయంలో కెప్టెన్ గిల్ ఇద్దరు కూడా చేతులెత్తేశారు. 12 పరుగుల వద్ద సాయి సుదర్శన్ వికెట్ సమర్పించుకుంటే.. కెప్టెన్ గిల్ 10 పరుగులకు అవుట్ అయ్యాడు.

ఇక్కడే గుజరాత్ టైటాన్స్ మొత్తం డీలా పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన బట్లర్ అయిన ఆదుకుంటాడని అందరూ అనుకున్నారు. అతగాడు కూడా చేసేదేమీ లేదన్నట్లుగా వ్యవహరించాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో అనవసరపు షాట్ కు వెళ్లి వికెట్ సమర్పించుకున్నాడు. స్టంట్ అవుట్ అయి, వెనుతిరిగాడు. అయితే సుందర్ మాత్రం 37 వంతుల 50 పరుగులు చేసి గుజరాత్ పరువు కాపాడాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు సాధిస్తేనే, గుజరాత్ ఓడిపోయి బెంగళూరు గెలుస్తుంది. ఇదే జరిగితే రెండోసారి రజత్ పటిదార్ సేన చాంపియన్ అవుతుంది.

అద్భుతంగా రాణించిన గుజ‌రాత్ బౌల‌ర్లు

Advertisement

గుజరాత్ తో జరిగిన ఈ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అందరూ అద్భుతంగా రాణించారు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా… జోష్ హెజెల్ వుడ్ కూడా మరో రెండు వికెట్లు తీశారు. ముఖ్యంగా రసిక్ మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్ జట్టును దెబ్బతీశాడు. కృనాల్ పాండ్యా కూడా ఓ వికెట్ పడగొట్టి శభాష్ అనిపించాడు. ఇది ఇలా ఉండగా గ్రూప్ స్టేజిలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 42వ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కూడా రాయల్ చాలెంజెస్ బెంగళూరు 155 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ సులభంగా చేదించింది. కానీ ఇప్పుడు గుజరాత్ 155 పరుగులు సాధిస్తే… బెంగళూరు చేదించనుంది. మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.

 

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

 

 

 

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×