E-Paper
Advertisement

ఆంధ్రాలో అట్టర్ ప్లాప్ అయిన ప్రయోగం ఇక్కడెందుకు?: జాన్​ వెస్లీ!

ఆంధ్రాలో అట్టర్ ప్లాప్ అయిన ప్రయోగం ఇక్కడెందుకు?: జాన్​ వెస్లీ!
Advertisement

Farmer DISCOM: స్వేచ్చ బ్యూరో: రైతు డిస్కం ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రైవేట్​ డిస్కంలకు ఉపయోగపడేలా ఈ డిస్కం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్​ లో ఈ ప్రయోగం విఫలమైందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అదానీ విద్యుత్తును మన రాష్ట్రంలోకి తీసుకొచ్చే యత్నం జరుగుతోందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. గత డిసెంబర్​ లో జీవో (నెంబర్​ 44)ను విడుదల చేయటం ద్వారా ప్రభుత్వం మూడో డిస్కంపై ఇటీవల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన ప్రజాభిప్రాయాలు సేకరించినపుడు చాలామంది దీనిని వ్యతిరేకించారన్నారు. వినియోగదారులపై భారం పడుతుందని వినియోగదారుల సంస్థలు, విద్యుత్‌ రంగ నిపుణులు, రైతు సంఘాలు అభిప్రాయపడ్డాయన్నారు.

ఆదాయ వనరు లేని నేపథ్యంలో..

2025, డిసెంబర్​ 18నాటికి ఎన్పీ, ఎస్పీ డిస్కాంల మొండి బాకీలు రూ.48,398 కోట్లు ఉన్నట్లు నిర్ధారించారన్నార. దీంట్లో నుంచి రైతు డిస్కాంకు 25,950 కోట్లు మార్చారన్నారు. ఇక, రైతు డిస్కంకు కేటాయించిన ఆస్తులు కేవలం 4,929 కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. పైగా, కేటాయించిన సర్వీసులన్నీ ప్రభుత్వ రాయితీలు పొందేవే తెలిపారు. ఈ డిస్కాంకు ఎలాంటి ఆదాయ వనరు లేని నేపథ్యంలో ప్రభుత్వమే సబ్సిడీగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రైతు డిస్కంకు 29,05,779 లక్షల వ్యవసాయ పంపు సెట్లు, 2.489 భారీ లిఫ్టు పథకాలు, 99 హైదరాబాదు మెట్రో కనెక్షన్లు, 41,132 మిషన్ భగీరథ కనెక్షన్లు. 639 త్రాగు నీటి కనెక్షన్లు…ఇలా మొత్తం 29,08,238లక్షల కనెక్షన్ల సర్వీసులను కేటాయించారన్నారు. ఇక, 18 జిల్లాలకు సేవలందించాల్సి ఉంటుందన్నారు. సంస్కరణల్లో భాగంగా రివాంప్ట్ డిస్ట్రిబ్యూషన్ స్కీంను పటిష్టం చేయటనికి 5,22,479 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తారన్నారు. ఒక్కో స్మార్ట్ మీటరుకు 25 వేల చొప్పున 1,306 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఈ నిధులను ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.

Advertisement

Also Read: గండిపేట భూ కబ్జా కేసులో సంచలనం.. జీవోల కోసం 4కోట్లు..!

ప్రైవేటీకరించేందుకు అవకాశం..

కేంద్ర ప్రభుత్వం సవరించిన విద్యుత్ చట్టం ప్రకారం క్రాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్తు రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ ఉత్పత్తి ఖర్చు కనుగుణంగా టారిఫ్‌లు నిర్ణయించాల్సి వస్తుందని తెలిపారు. డిస్పాచింగ్ సెంటర్ బాధ్యతలు కేంద్రం చూస్తుందన్నారు. ఈ చట్టాన్ని అమలు చేస్తే చట్టం అమలు చేస్తే వినియోగదారులపై విపరీతమైన భారం పడుతుందన్నారు. పైగా విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించేందుకు అవకాశం వుంటుందని పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా? లేదా? అన్నది స్పష్టంగా ప్రకటించాలన్నారు. చూస్తుంటే అదానీ విద్యుత్తును మన రాష్ట్రంలోకి కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తోందన్నారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలను ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు ప్రజల్లో తీవ్రమైన ప్రతిఘటన వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు బడా కార్పొరేట్లకు విద్యుత్ రంగాన్ని అప్పజెప్పే ప్రయత్నం చేస్తే ప్రజా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. మూడవ డిస్కం ప్రతిపాదనను ఉపసంహరించుకొని రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ నిర్వహణ బాధ్యతను కొనసాగించాలని కోరారు.

Advertisement

Also read: సర్వేలో టాప్ రికార్డ్.. ఫస్ట్ ప్లేస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×