E-Paper
Advertisement

సూర్య సినిమా థియేట్రికల్ రైట్స్ లొల్లి.. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు షాక్!

సూర్య సినిమా థియేట్రికల్ రైట్స్ లొల్లి.. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు షాక్!
Advertisement

Suriya Distribution: కరుప్పు  సినిమా సక్సెస్ అవడంతో తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వనాథన్ అండ్ సన్స్’కి ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది.ఇక సినిమా  కోసం డిస్టిబ్యూటర్స్ ఎంత చెల్లించడానికి అయినా వెనకడుగు వేయట్లేదు. ఇక దీన్నే క్యాష్  చేసుకోవాలనుకున్న మేకర్స్ ఇపుడు ఇద్దరి వద్దా అడ్వాన్స్ లు పుచ్చుకుని ఎవరికి సినిమా ఇవ్వాలా అని తెగ సతమతమైపోతున్నారట.

ట్రేడ్ వర్గాల్లో ఇపుడు హాట్ టాపిక్

Advertisement

అవును..ఒక్క సినిమా హక్కుల కోసం కేరళలో ఇద్దరు డిస్టిబ్యూటర్స్ , తమిళనాడులో ఇంకో ఇద్దరు డిస్టిబ్యూటర్స్ పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. పాత బయర్లు మేము ముందే కొన్నాం అంటూ అగ్రిమెంట్ పేపర్స్ చూపిస్తుంటే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన  బడా డిస్ట్రిబ్యూటర్లు మేము భారీ రేటు కోట్ చేశాం మాక్కావాల్సిందే అని పట్టు బడుతున్నారట.దీంతో ఇప్పుడు సినిమా రైట్స్ మొదటగా కొన్నవాళ్ళకి దక్కుతాయా లేక ఆఖరి నిమిషంలో ఎక్కువ రేటుకి కొన్నవాళ్ళకి ఇస్తారా అనేది ట్రేడ్ వర్గాల్లో ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎవరికి వారు రైట్స్ మావంటే మావే 

Advertisement

కేరళ హక్కుల విషయానికి వస్తే, కొన్ని నెలల క్రితమే ఒక ప్రముఖ పంపిణీ సంస్థ భారీ మొత్తంలో అడ్వాన్స్ చెల్లించి ఒప్పందం కుదుర్చుకుందనే వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్‌గా మరో  బడా డిస్టిబ్యూటర్ రంగంలోకి దిగి మరింత ఎక్కువ ఆఫర్ ఇచ్చి ఆ రైట్స్‌ను లాక్కోవడానికి ట్రై చేయడంతోనే ఈ  కాంట్రవర్సీ మొదలైనట్టు తెలుస్తుంది.సరిగ్గా తమిళనాట కూడా ఇలాగే ఇద్దరు డిస్టిబ్యూటర్స్ కి సినిమాని అమ్మగా ఎవరికీ వారు రైట్స్ మావే అంటూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

also read:‘ఆ అక్కలంతా ఏమైపోయారు?’.. NEET పేపర్ లీక్‌పై స్పందించిన అనసూయ!

మరి  ప్రొడక్షన్ హౌస్ మాత్రం పాత బయర్లను ఒప్పించి, కొత్త వాళ్ళతో డీల్ సెటిల్ చేస్తుందా లేక మొదటి నుంచి అండగా ఉన్న పాత డిస్ట్రిబ్యూటర్లకే మొగ్గు చూపుతుందా అనేది ఇపుడు మిస్టరీగా మారింది. గతంలో ‘సింగం 3’ (ఫిబ్రవరి 9, 2017) విడుదల సమయంలో కూడా తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో ఇలాంటి  బిజినెస్ వివాదాలు వచ్చినప్పటికీ చివరకు ప్రొడ్యూసర్స్ మండలి జోక్యంతో సెటిల్ అయిన సంగతి మనకి తెల్సిందే.

ఎలాంటి డిసీషన్ తీసుకుని ఇద్దరికీ న్యాయం చేస్తారో

అయితే తాజాగా వేడెక్కిన ఈ వ్యవహారం కాస్తా  తమిళ, మలయాళ ఫిలిం ఛాంబర్ల మెట్లు ఎక్కేలానే  కనిపిస్తోంది. పాత బయర్లు కోర్టుకి వెళ్తామని హెచ్చరిస్తుంటే, ప్రొడక్షన్ టీమ్ మాత్రం రెండు వర్గాలకు నష్టం రాకుండా థియేటర్ల షేరింగ్ లేదా రీజనల్ పార్టనర్‌షిప్ పద్ధతిలో రాజీ కుదిర్చేందుకు తెరవెనుక తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందట. సూర్య సినిమా థియేటర్లలో పడితే కలెక్షన్ల వర్షం గ్యారెంటీ అనే నమ్మకమే ఈ రేంజ్ పోటీకి ప్రధాన కారణం అని చెప్పకతప్పదు.

 ఏది ఏమైనా, బిజినెస్ సర్కిల్స్ చూపు మొత్తం ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ తీసుకునే ఫైనల్ నిర్ణయం మీదే ఉంది.చూడాలి ఎలాంటి డిసీషన్ తీసుకుని ఇద్దరికీ న్యాయం చేస్తారో !

also read:మా ఆయనకే లేని నొప్పి మీకెందుకురా నాయనా?.. సాలిడ్ పంచ్ ఇచ్చిన వెటరన్ బ్యూటీ !

Related News

‘చెన్నై లవ్ స్టోరీ’కి రూ.కోటి రూపాయల ఫ్రీ టికెట్లు?ఏంటిది కిరణ్?

ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారంటూ సంచలన ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్!

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న చెన్నై లవ్ స్టోరీ బ్యూటీ.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

‘ఆ అక్కలంతా ఏమైపోయారు?’.. NEET పేపర్ లీక్‌పై స్పందించిన అనసూయ!

అఖిల్ ఏ దేశ పౌరుడో తెలుసా.. త్వరలోనే?

నీట్ పేపర్ లీక్ వివాదంపై నవదీప్ షాకింగ్ రియాక్షన్?

మా ఆయనకే లేని నొప్పి మీకెందుకురా నాయనా?.. సాలిడ్ పంచ్ ఇచ్చిన వెటరన్ బ్యూటీ !

Big Stories

Advertisement
×