E-Paper
Advertisement

Anil Ravipudi: బాబోయ్ ఓటీటీని కూడా వదిలిపెట్టరా.. నీ స్ట్రాటజీనే వేరయా రావిపూడి!

Anil Ravipudi: బాబోయ్ ఓటీటీని కూడా వదిలిపెట్టరా.. నీ స్ట్రాటజీనే వేరయా రావిపూడి!
Advertisement

Anil Ravipudi: అనిల్ రావిపూడి ప్రమోషనల్ స్ట్రాటజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు వచ్చిన సంక్రాంతికి కానీ, ఈ సంక్రాంతికి కానీ, ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయంటే కారణం.. అనిల్ సినిమాలో ఉన్న దమ్ము మాత్రమే కాదు.. ఆయన ప్రమోషనల్ స్ట్రాటజీ కూడా. ఇప్పుడు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) విషయంలో ఆ స్ట్రాటజీ ఇంకాస్త పెంచుతున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీలోకి రాబోతోంది. ఈ క్రమంలో ఓటీటీకి సంబంధించి కూడా ఆయన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. జీ తెలుగుకు సంబంధించి ప్లే అవుతున్న ప్రతి కార్యక్రమంలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ జీ5లోకి వస్తున్నారు అంటూ తెగ హడావుడి చేస్తున్నారు. అలాగే, అనిల్ రావిపూడి (Anil Ravipudi) అటెండ్ అయిన ప్రతి చోట ఈ సినిమాకు సంబంధించి ఓ రేంజ్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. అలా ఓటీటీలోకి సినిమా వస్తున్న టైమ్‌లో కూడా అనిల్ రావిపూడి తన సినిమా కోసం ఎంతగానో సపోర్ట్ అందిస్తుండటంతో.. ఇండస్ట్రీలో మరోసారి ఆయన పేరు మారుమోగుతోంది.

Also Read- Tollywood: మళ్లీ షూటింగ్స్ ఆగిపోతున్నాయా? వారు సమ్మెకు సిద్ధమవుతున్నారా?

రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో హిస్టరీ

Advertisement

వాస్తవానికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు హీరోహీరోయిన్లు పెద్దగా ప్రమోట్ చేసింది లేదు. హీరో ప్రీ రిలీజ్ వేడుకకైనా వచ్చారు. హీరోయిన్ మాత్రం అస్సలు దేనికి రాలేదు, కాకపోతే రెండుసార్లు ప్రమోషన్స్ చేయాలా అంటూ వీడియోలు వదిలారు.. అంతే. అదే గత సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు అయితే వెంకీమామతో పాటు ఇద్దరు హీరోయిన్లు ఆటలు ఆడారు, పాటలు పాడారు, డ్యాన్సులు చేశారు. ఇంకా ఎన్నో ఊర్లు తిరిగారు. మాములుగా రచ్చ చేయలేదు. అలా సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశారు. కానీ, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు మాత్రం నిర్మాతలిద్దరినీ వెంట బెట్టుకుని, దర్శకుడు అనిల్ రావిపూడే అంతా చూసుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా కలెక్షన్ల సునామీ సృష్టించి, రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో చరిత్రను సృష్టించాయి.

Also Read- High: అనిల్ రావిపూడి కో-రైటర్ హీరోగా.. ఏం ‘హై’ ఇచ్చాడురా బాబు!

ఓటీటీలోనూ రఫ్ఫాడిస్తారా?

Advertisement

ఇక ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అయితే దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్‌ని రాబట్టి.. అటు చిరుకి, ఇటు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడీ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 11 నుంచి జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఆ విషయం అందరికీ తెలియాలని అనిల్ రావిపూడి కూడా ఓ చెయ్యి వేస్తున్నారు. జీ తెలుగులో అనిల్ రావిపూడి ఓ షో‌కు జడ్జిగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అలా ‘జీ’తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అది కూడా ఇప్పుడు యూజ్ అవుతోంది. మరి అనిల్ స్ట్రాటజీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో? ఓటీటీలో శంకర వర ప్రసాద్ గారు ఎలా రఫ్ఫాడిస్తారో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Also Read- Pawan Kalyan: పవన్ సినిమాలో యంగ్ హీరో క్యామియో..థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×