E-Paper
Advertisement

Crime Thriller OTT : చచ్చిన ఏడేళ్ళ తరువాత వరల్డ్ పాలిటిక్స్ ను ఊపేసిన ఖేడీ కథ… అమెరికాను షేక్ చేసిన కామన్ మ్యాన్ క్రైమ్ లార్డ్ గా ఎలా ?

Crime Thriller OTT : చచ్చిన ఏడేళ్ళ తరువాత వరల్డ్ పాలిటిక్స్ ను ఊపేసిన ఖేడీ కథ… అమెరికాను షేక్ చేసిన కామన్ మ్యాన్ క్రైమ్ లార్డ్ గా ఎలా ?
Advertisement

Crime Thriller OTT :క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడడానికి ఎంత క్రేజీగా ఉంటాయి కదా. ఇక కామన్ మ్యాన్ కాస్తా ప్రపంచాన్ని గడగడలాడించే స్థాయికి ఎదిగే కథలంటే ఎవరికి నచ్చదు చెప్పండి ? ఆల్మోస్ట్ అందరూ కలలు గనే జీవితం అది. రియల్ లైఫ్ లో ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి రీల్ లైఫ్ లో అలాంటివి చూసి ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అయితే ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సినిమాలు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటి మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

అగ్రదేశం అమెరికాను షేక్ చేసిన ఓ మనిషి కథ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ప్రపంచంవ్యాప్తంగా మారుమ్రోగిన ఆ వ్యక్తి ఎవరో కాదు జెఫ్రీ ఎప్స్టీన్. ఆయన మరణించిన ఏడు సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచ రాజకీయాలను కదిలిస్తూనే ఉన్నారు. ఆయన బయోపిక్ గా రూపొందిన ఆ సిరీస్ పేరు ‘జెఫ్రీ ఎప్స్టీన్: ఫిల్తీ రిచ్’. రాడికల్ మీడియా, జేమ్స్ ప్యాటర్సన్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్, థర్డ్ ఐ మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌ లో అందుబాటులో ఉంది. 4 ఎపిసోడ్‌ల ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ కు లిసా బ్రయంట్ దర్శకత్వం వహించారు. ఈ డాక్యుమెంటరీలో ప్రపంచానికి తెలియని వాస్తవాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రతి ఎపిసోడ్ దాదాపు గంట నిడివి ఉంటుంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసు గురించి తెలుసుకోవాలనుకుంటే, మీరు ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ ను నెట్‌ఫ్లిక్స్‌ లో చూడవచ్చు.

అసలు కథ ఇదే

Advertisement

నేరాల ప్రపంచంలో చెప్పుకోదగ్గ పేరు జెఫ్రీ ఎప్స్టీన్. ఆయన మరణించిన ఏడు సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచ రాజకీయాలలో జెఫ్రీ ఎప్స్టీన్ పేరు విన్పిస్తునే ఉంది. అమెరికా నుండి యూరప్ వరకు వార్తా పత్రికలలో కూడా జెఫ్రీ ఎప్స్టీన్ పేరుతో నిండి పోయాయి. కానీ 2019లో అనుమానాస్పద పరిస్థితులలో జైలులో మరణించిన ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? గణితం, భౌతిక శాస్త్రాల ఉపాధ్యాయుడు అయిన ఆయన సెలవుల్లో మాత్రమే ఉపయోగించగలిగే 20 మిలియన్ల ఇంటిని ఎలా కొన్నాడు ? ఐర్లాండ్‌ లోని వర్జిన్ ఐలాండ్, ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాత వ్యక్తులు కూడా దాని నీడ నుండి తప్పించుకోలేని విధంగా విలాసవంతమైన భ్రమను ఎలా సృష్టించాడు ? ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానమే ఆరు సంవత్సరాల క్రితం నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైన ఈ సిరీస్.

2019లో జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి జైలులో అనుమానాస్పదంగా మరణించాడు. తరువాత మైనర్ బాలికలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చింది. అతను డజన్ల కొద్దీ బాలికలను, వారిలో చాలామంది మైనర్లను వర్జిన్ దీవికి తీసుకెళ్లాడనే షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అన్ని సౌకర్యాలతో కూడిన ఈ ఏకాంత ద్వీపం భయంకరమైన కార్యకలాపాలకు వేదికగా ఉండేదని అంటారు. కానీ జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? ఎప్స్టీన్ పేరు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉండడానికి కారణం ఏంటి? అతని మరణం తర్వాత, గత ఏడు సంవత్సరాలుగా పీడకలగా మిగిలిపోయిన ఆ కథ ఏంటి? అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

Advertisement

Read Also : రాబిన్ హుడ్ లా మారే కాళీమాత భక్తుడు… బ్రిటీషోళ్ళకే భయం పుట్టించే బందిపోటు

Tags

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×