E-Paper
Advertisement

ఒడిశా బ్యాంకు ఘటన.. అకౌంట్ హోల్డర్ మరణిస్తే మనీ విత్ డ్రా ఎలా?.. రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఒడిశా బ్యాంకు ఘటన.. అకౌంట్ హోల్డర్ మరణిస్తే మనీ విత్ డ్రా ఎలా?.. రూల్స్ ఏం చెబుతున్నాయి?
Advertisement

Odisha Bank Incident: ఒడిశాకు చెందిన జీతూ ముండా.. మరణించిన తన సోదరి అకౌంట్ లోని రూ.20 వేల కోసం బ్యాంకు చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడు. చివరికి తన చెల్లి సమాధి తవ్వి అవశేషాలను బ్యాంకుకు తీసుకెళ్లాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. చివరకు బ్యాంకు అధికారులు, స్థానిక అధికారులు స్పందించి అతడికి డబ్బు అందించారు. ఇది ఒక్క జీతూ ముండా సమస్య మాత్రమే కాదు. దేశంలోని కోట్లాది మంది సమస్య. జనవరి 2026 ఆర్బీఐ డేటా ప్రకారం దేశంలోని పలు బ్యాంకుల్లో 72,454 కోట్ల రూపాయల అన్‌క్లైమ్డ్ డబ్బు మురిగిపోతోంది. అదంతా చాలా వరకు నిరుపేదలు, సామాన్యులు, జీతు ముండా లాంటి ఆదివాసీల డబ్బు.

సరైన పత్రాలు లేకపోతే

అకౌంట్ హోల్డర్ మరణిస్తే, అతడి ఖాతాలో డబ్బు వారసులు లేదా నామినీ పొందడానికి బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి. సరైన పత్రాలు లేనప్పుడు ఏం చేయాలో ఈ కేసు ఒక ఉదాహరణగా మారింది. తన సోదరి ఖాతాలోని డబ్బు విత్‌డ్రా చేసుకోవడం సోదరి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకువచ్చి మరణానికి రుజువుగా చూపించమని బ్యాంకు సిబ్బంది బలవంతం చేశారని సోషల్ మీడియా పలువురు కామెంట్స్ పెట్టారు. అయితే ఒడిశా గ్రామీణ బ్యాంకు అనుబంధ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఈ ఆరోపణలను ఖండించింది. అవసరమైన పత్రాలు లేకపోవడం, ఈ విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని బ్యాంక్ తెలిపింది.

Advertisement

బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం.. డెత్ సర్టిఫికెట్, చట్టబద్ధ వారసుల ధృవీకరణ పత్రం ఉంటేనే మరణించిన వ్యక్తి ఖాతాలోనే డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకు నిబంధనలు ప్రకారం.. జీతూ ముండా సోదరి అకౌంట్ లోని రూ. 19,402 మొత్తాన్ని ముగ్గురు చట్టబద్ధ వారసులకు పంపిణీ చేశారు.

అసలు ఏం జరిగింది

జీతూ ముండా సోదరి ఇటీవల మరణించింది. ఆమె బ్యాంకు అకౌంట్ లో రూ.20 వేల వరకు ఉండడంతో.. జీతూ ముండా ఎలాంటి మరణ ధృవీకరణ పత్రం లేదా వారసత్వ పత్రాలు సమర్పించకుండా డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అకౌంట్ లోని నామినీ కూడా మరణించడంతో.. బ్యాంకు రికార్డుల్లో జీతూ ముండా పేరు లేకపోవడం, సరైనా పత్రాలు చూపకపోవడంతో.. అతడి అభ్యర్థనను బ్యాంకు సిబ్బంది తిరస్కరించారు. తన సోదరి మరణాన్ని నిరూపించే ప్రయత్నంలో, అతడు సోదరి అస్థిపంజర అవశేషాలను మూటగట్టి బ్యాంకుకు తీసుకొచ్చాడు. ఈ ఘటన వైరల్ కావడంతో.. అధికారులు రంగంలోకి దిగి, అవసరమైన పత్రాలను జారీ చేయడంతో, అతడి క్లెయిమ్ ప్రాసెస్ అయింది.

ఖాతాదారుడు మరణిస్తే పాటించాల్సిన నియమాలు ఏమిటి?

Advertisement

ఖాతాదారుడు మరణించిన తర్వాత, ఆ అకౌంట్ ను సాధారణ అకౌంట్ గా పరిగణించరు. అందులోని నిధులకు సంబంధించి క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ కిందకు వస్తాయి.

బ్యాంకులు కోరే డాక్యుమెంట్స్

  • డెత్ సర్టిఫికెట్
  • నామినీ లేదా వారసుడి రుజువు పత్రాలు
  • క్లెయిమ్ చేసే వారి ఐడెంటిటీ పత్రాలు
  • ఇవి లేకుండా క్లెయిమ్ చేయడానికి కుదరదు. నిజమైన హక్కుదారులు వచ్చిన సరైన పత్రాలు లేకపోతే బ్యాంకులు నిధులను విడుదల చేయడానికి అనుమతించవు.

Also Read: అమ్మబాబోయ్.. ఏప్రిల్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల హాలీడేస్ లిస్ట్ ఇదే!

నామినీలు

ఒడిశా ఘటనతో బ్యాంకింగ్ వ్యవహారాల్లోని లోపాలను ఎత్తి చూపింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ విధానాలపై చాలా మందికి అవగాహన ఉండదు. మోసాలను నివారించడానికి, డబ్బు సరైన లబ్ధిదారులకు చేరేందుకు బ్యాంకులు కఠినమైన నియమాలను పాటిస్తాయి. కానీ సరైన పత్రాలు లేనప్పుడు, సరైన క్లెయిమ్‌లు కూడా ఆలస్యం కావచ్చు. అందుకే బ్యాంకు అకౌంట్లకు జాయింట్ లేదా నామినీలను పెట్టుకోవడం ఉపయోగకరమని నిపుణులు సూచిస్తున్నారు.

 

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×