BigTV English

Teja sajja: ఐఫాలో చిరు, బాలయ్య పై తేజ సజ్జా సెటైర్స్.. దెబ్బకు క్లారిటీ!

Teja sajja: ఐఫాలో చిరు, బాలయ్య పై తేజ సజ్జా సెటైర్స్.. దెబ్బకు క్లారిటీ!

Teja sajja: తేజ సజ్జా (Teja Sajja).. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తేజా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఎంతో మంది స్టార్ హీరోల చిన్నప్పటి పాత్రల్లో అలాగే స్టార్ హీరోల కొడుకు, మనవడు ఇలా విభిన్న పాత్రలు పోషించారు. అలాంటి తేజా ‘జాంబి రెడ్డి’ మూవీతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అలా యంగ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తేజ సజ్జా.. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్లో వచ్చిన ‘హనుమాన్’ అనే సినిమాలో సూపర్ మాన్ గా నటించారు. ఈ హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో తేజా సజ్జా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.అయితే అలాంటి తేజా నటించిన తాజా మూవీ మిరాయ్ (Mirai).. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలకు సిద్ధంగా ఉండడంతో చిత్ర యూనిట్ బిజీబిజీగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాని తెగ ప్రమోట్ చేసుకుంటున్నారు.


స్టార్ హీరోలపై తేజ సజ్జా కామెంట్స్..

ఈ నేపథ్యంలోనే ఐఫా అవార్డ్స్ లో స్టార్ హీరోలపై జోకులు వేయడం పై తేజ సజ్జా ఓ క్లారిటీ ఇచ్చారు. 2024 దుబాయ్ వేదికగా జరిగిన ఐఫా వేడుకల్లో రానా,తేజా ఇద్దరు హోస్టులుగా చేసి ఎంతో మంది స్టార్ హీరోలపై సెటైర్లు వేయడమే కాకుండా వాళ్లపై జోకులు కూడా పేల్చారు. రానా విషయం పక్కన పెడితే.. తేజ సజ్జా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. అలాంటి చిన్న హీరో కూడా పెద్ద హీరోలపై సెటైర్లు వేయడం,జోకులు వేయడం చాలామంది హీరోల అభిమానులకు నచ్చలేదు. వాళ్లు ఐఫా అవార్డ్స్ లో వేసిన జోకులపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది.ఆ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో తేజాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ.. తేజా సజ్జా మా హీరోలకు సారీ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు.

ALSO READ:Bigg Boss 9 Promo :ఫస్ట్ డేనే ఫస్ట్ ఎలిమినేషన్… అంతా డబుల్ డోస్ డబుల్ ట్విస్ట్


క్లారిటీ ఇచ్చిన హీరో..

అయితే ఈ జోకులు ఎందుకు వేయాల్సి వచ్చిందో తాజాగా తేజ తన మిరాయ్ ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు. తేజ సజ్జా మాట్లాడుతూ.. “నేను, రానా గారు ఐఫా అవార్డ్స్ లో చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్ సార్ లపై జోకులు వేసాం. అయితే ఈ జోకులు వాళ్ళ పర్మిషన్ లేకుండా వెయ్యలేదు. నేను , రానా ఏదో ఒకటి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ ఉండగా వెంకటేష్ సార్ వచ్చి ఒరేయ్ నా మీద ఏదైనా జోక్ వేయరా.. ఇప్పుడు నా మీద ఏం జోక్ వేస్తారో చెప్పురా సరదాగా ఉంటుంది అంటూ స్వయంగా అడిగారు. అలాగే అనిల్ రావిపూడి గారు కూడా వచ్చి తేజా ఇప్పుడు నేను ఇలా అంటాను.. నువ్వు అలా అను అని నాకు కూడా ఎన్నో చెప్పారు.ఇక చిరంజీవి, బాలకృష్ణ సార్ ల అనుమతి లేకుండా వాళ్ళ మీద జోకులు వెయ్యలేదు.అంత పెద్ద హీరోల నుండి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ల మీద జోకులు ఎలా వేస్తాం. వాళ్ళ అనుమతి తీసుకోకుండా వాళ్ళ ముందు ఈ మాటలు మాట్లాడగలమా.. ముందుగా ఇన్ఫామ్ చేశాకే ఏదో ఎంజాయ్మెంట్ కోసం సరదాగా అలా చేశాం.

ఇకపై అలా జరగదు..

ఏం చేసినా అది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని చేస్తాం. కానీ స్టార్ హీరోలపై జోకులు వేసే విషయం గురించి ఆడియన్స్ ఒకసారి ఆలోచించి కామెంట్స్ చేస్తే బాగుండేది.కానీ ఏదో అలా జరిగిపోయింది. ఇప్పటినుండి మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఇతర హీరోల గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ గుర్తించే స్థాయిలో మనం ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం మానేస్తేనే బెటర్ అని నా అభిప్రాయం” అంటూ తేజా సజ్జా చెప్పుకొచ్చారు.అలా హీరోల పర్మిషన్ తీసుకొని తేజ సజ్జా జోకులు వేసినప్పటికీ అభిమానులకు ఈ విషయం తెలియక సోషల్ మీడియాలో తేజా మీద నెగెటివిటీ తీసుకువచ్చారు.ఈ ఉద్దేశంతోనే తేజ ఇప్పటి నుండి ఇలాంటివి మానేయడం బెటర్ అని మాట్లాడారు.

Related News

Urvashi Rautela: అభిమాని ఫోన్ లాగేసుకున్న ఊర్వశీ.. అసలు ఏమైందంటే?

Film industry: ప్రముఖ సినీ దర్శకుడు అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Sonu Sood: మరీ ఇంత గొప్పోడివేంటయ్యా.. ఏకంగా అలాంటి హామీ!

Bigg Boss: బిగ్ బాస్ కు కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసా?

Big Stories

×