Bigg Boss 9 Promo :బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను మరొకసారి ఎంటర్టైన్ చేయడానికి సీజన్ 9 అంటూ ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 7న అంటే ఈరోజు ఆదివారం అట్టహాసంగా సాయంత్రం ఏడు గంటలకు ఈ సరికొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అగ్నిపరీక్షలో నెగ్గి.. 6 మంది కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అందులో ఎవరెవరు అనే విషయాన్ని.. తాజాగా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. అందులో చూపించేశారు.
అంతేకాదు ఇక్కడ ఊహించని ట్విస్ట్ అందరిని ఆశ్చర్యపరిచింది. కంటెస్టెంట్ గా హౌస్ లోకి రావడానికి స్టేజ్ పైకి వచ్చిన ఆ వ్యక్తి.. తనతో పాటు తీసుకొచ్చిన బాక్స్ ను హౌస్ లోకి తీసుకెళ్లడానికి పర్మిషన్ కోరారు. బిగ్ బాస్ నిరాకరించడంతో అతడు తిరిగి వెళ్ళిపోయాడు. ఇదే ఇప్పుడు హైలైట్ గా నిలిచింది. హౌస్ లోకి ఇంకా అడుగుపెట్టనే లేదు అప్పుడే బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ ని వెనక్కి పంపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ హౌస్, డబుల్ డోస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ నాగార్జున అంచనాలు పెంచేశారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే రిలీజ్ చేసిన గ్రాండ్ లాంచ్ ప్రోమో కూడా అందరిని ఆకట్టుకుంటోంది.
ALSO READ:Bigg Boss: బిగ్ బాస్ కు కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసా?
ప్రోమో విషయానికి వస్తే..
తాజాగా సాయంత్రం నిర్వహించబోతున్న గ్రాండ్ లాంఛ్ కార్యక్రమానికి సంబంధించి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. అందులో ఏముంది అనే విషయానికి వస్తే.. నాగార్జున ఎలా అయితే ఈ షో పై ఆసక్తిని పెంచేశారో.. షో కి తగ్గట్టుగానే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో కూడా అలరిస్తోంది. ఒక ఇల్లు అయితే చదరంగం కానీ ఇక్కడ డబల్ హౌస్ ఇది రణరంగమే అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ మరింత ఆకట్టుకుంటుంది. అటు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టబోయే ముందు మాట్లాడిన మాటలకు ఏమాత్రం లొంగకుండా.. అవసరమైతే హౌస్ లోకి రావచ్చు లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనే రేంజ్ లో బిగ్ బాస్ ఇస్తున్న కఠిన ఆంక్షలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా మిగతా సీజన్ల కంటే ఈ సీజన్ చాలా భిన్నంగా ఉండబోతుందని ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోని చూస్తేనే అర్థమవుతోంది. మరి ఎంతో పగడ్బందీగా.. ఊహించని విధంగా కంటెస్టెంట్లకు సైతం చెమటలు పట్టేలా ఉండనున్న ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఎలాంటి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
కామన్ మ్యాన్ క్యాటగిరీలో హౌస్ లోకి వెళ్ళబోతున్న ఆరుగురు వీరే..
ఇకపోతే 20వేలకు పైగా కామన్ మ్యాన్ క్యాటగిరి కోసం ప్రజల నుండి అప్లికేషన్లు రాగా.. అందులో వివిధ రౌండ్స్ ద్వారా కేవలం 45 మందిని ఎంపిక చేశారు.వీరికి అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహించి, కఠిన టాస్కులు ఇచ్చి ఫైనల్ గా ఆరు మందిని ఎంపిక చేశారు. మొదట్లో ఐదు మందిని హౌస్ లోకి పంపిస్తారని వార్తలు వచ్చినా.. ఇప్పుడు 6 మంది హౌస్ లోకి వెళ్ళబోతున్నారు.దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీశ్, ఆర్మీ పవన్ కల్యాణ్, ప్రియాశెట్టి, హీమ్యాన్ పవన్ వీరంతా కూడా హౌస్ లోకి వెళ్ళబోతున్నారు.