BigTV English

UP News: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై డెలివరీ, బేబీ పుట్టిన గంటకే

UP News: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై డెలివరీ, బేబీ పుట్టిన గంటకే
Advertisement

UP News: కామాంధులు రెచ్చిపోతున్నారు. ఫలితంగా మైనర్ బాలికలు వారి చేతుల్లో బలవుతున్నారు. తాజాగా యూపీలో ఓ ఘటన జరిగింది. 11 ఏళ్ల బాలికకు ఆశ చూపాడు. ఆ తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏడు నెలల తర్వాత పేరెంట్స్‌కి అసలు విషయం తెలిసి షాకయ్యారు. మైనర్ బాలిక డెలివరీ అయ్యింది. చివరకు ఏం జరిగిందంటే..


యూపీలో బరేలీ జిల్లాలోని నవాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల రషీద్‌కు వివాహం జరిగింది. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన రషీద్‌కు ఇంటి సమీపంలో ఉండే 11 ఏళ్ల బాలికపై వీడి దృష్టి పడింది. తొలుత యువతితో సరదగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు పండ్లు ఇవ్వడం మొదలుపెట్టాడు.

ఆ పండ్లు వెనుక అర్థాన్ని గ్రహించలేకపోయింది ఆ బాలిక. ఎవరూ లేని సమయంలో బాలికను ఇంటికి తీసుకెళ్లాడు. మాయ మాటలు చెప్పి మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు చేశారు. ఇదంతా ఎనిమిది నెలల కిందట జరిగింది. గురువారం బాలిక తీవ్రమైన నొప్పులు వస్తున్నాయి. వెంటనే తల్లిదండ్రులు కూతుర్ని ఆసుపత్రికి తరలించారు.


అక్కడ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయగా షాకయ్యారు. బాలిక ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. అదే రోజు బాలికను తల్లిదండ్రులు డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మైనర్ బాలిక ఓ బిడ్డకు జన్మ ఇచ్చింది. బేబీ పుట్టిన గంటలోపు చనిపోయింది. ప్రస్తుతానికి బాలికకు ప్రాణాప్రాయం తప్పింది. ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది.

ALSO READ: రూటు మార్చిన చెడ్డీ గ్యాంగ్.. టార్గెట్ మహిళలు, అమ్మాయిలే

డెలివరీకి ముందు బాలిక.. రషీద్ పేరును కుటుంబసభ్యులకు తెలిపింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ మొదలుపెట్టారు. శనివారం నిందితుడ్ని అరెస్ట్ చేశారు. చనిపోయిన బిడ్డ నుంచి డీఎన్ఏ సాంపిల్స్ తీసి టెస్ట్‌కు పంపారు.

దీనిపై పోలీసులు నోరువిప్పారు. అత్యాచారం గురించి బయటకు చెబితే ఇంట్లో వారిని చంపేస్తానని బాలికను రషీద్ బెదిరించాడని తెలిపాడు. బిడ్డ నుంచి డీఎన్‌ఏ సాంపిల్స్ సేకరించి టెస్టుకు పంపామని, రిపోర్టు ఇంకా రావాల్సి ఉందన్నారు. పైవిషయాలు బాలిక అన్నయ్య, పోలీసులు వెల్లడించారు.

Related News

Teenager Death: పటాసులు కొనలేనంత పేదరికం.. ఇంట్లోనే బాంబు తయారీ, భారీ పేలుడులో టీనేజర్ దుర్మరణం!

UP Shocker: కుక్కపై ప్రేమ.. బాలుడికి కరెంట్ షాకిచ్చి, విషం పెట్టేసి చంపేసిన యజమాని!

Hanamkonda: క్లాస్ రూమ్‌లో అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిన 4వ తరగతి విద్యార్థి.. వైద్యులు చెప్పిన కారణం ఇదే

Fake Currency: విశాఖలో దొంగ నోట్ల కలకలం.. మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి అరెస్ట్

Bengaluru Crime: మహిళపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ, బెంగుళూరులో షాకింగ్ ఘటన

Tuni Case Update: చెరువులో దూకే ముందు ఏం జరిగిందంటే.. తుని సీఐ చెప్పిన నిజాలు

Tuni case update: తుని ఘటన.. చెరువులోకి దూకి తాత ఆత్మహత్య

Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం, టార్గెట్ బీహార్ ఎన్నికలు?

Big Stories

×