Urvashi Rautela: సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి.. ఎక్కడైనా కనిపిస్తే చాలు వీరితో సెల్ఫీ దిగాలి అని, కరచాలనం చేయాలి అని అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడతారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒక్కొక్కసారి అభిమానుల అభిమానానికి కూడా హద్దులు ఉండవు. దాంతో సెలబ్రిటీలు ఆగ్రహించక తప్పదు. ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరోలను అభిమానులు సెల్ఫీల కోసం ఇబ్బంది పెట్టి…ఆ తర్వాత చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. ముఖ్యంగా తమను సెల్ఫీ అడిగిన వారి దగ్గర నుంచి.. మొబైల్స్ కూడా లాక్కొని వెళ్లిపోయిన హీరోలు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత తిరిగి ఇచ్చేశారు అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ నటి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela)కూడా వచ్చి చేరింది. తాజాగా ఈమె అభిమానుల నుంచి ఫోన్లు లాగేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఉన్నట్టుండి ఊర్వశి అభిమానుల నుంచి ఫోన్లు లాగేసుకోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అభిమానుల ఫోన్లు లాగేసుకున్న హీరోయిన్..
వస్త్రధారణ తోనే కాదు భిన్నవిభిన్నమైన వస్తువులను ధరించి అందర్నీ ఆకట్టుకునే ఈమె ఇప్పుడు తాజాగా మరొకసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా అభిమానులను సరదాగా ఆట పట్టించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసింది ఊర్వశీ. ఈమెను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు.అంతేకాదు ఈమెను సెల్ఫీలు కూడా అడిగారు. దీంతో సెల్ఫీలు అడిగిన అభిమానుల మొబైల్ ఫోన్లను సరదాగా లాక్కుంది ఊర్వశీ . ఇక అలా అభిమానుల నుంచి ఫోన్లను లాక్కొని నవ్వుతూ ముందుకు వెళ్లిపోయి.. తిరిగి మళ్ళీ అభిమానులకి ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొత్తానికి అయితే సరదాగా అభిమానుల నుంచి ఫోన్స్ లాగేసుకుని మళ్లీ ఇచ్చేసిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ALSO READ:Film industry: ప్రముఖ సినీ దర్శకుడు అరెస్ట్.. అసలేం జరిగిందంటే?
నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..
ఇకపోతే ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్స్ కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు. సరదా స్వభావం కలిగిన నటి అని ఒకరు కామెంట్ చేస్తే.. మరి కొందరు ప్రజల నుండి ఫోన్లు తీసుకున్న మొదటి నటి ఈమె అంటూ కామెంట్లు చేశారు ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం గమనార్హం..
ఊర్వశీ రౌటేలా కెరియర్..
ఊర్వశీ రౌటేలా కెరియర్ విషయానికి వస్తే.. హిందీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇటీవల బాలయ్య హీరోగా నటించిన ‘డాకు మహారాజ్ ‘ సినిమాలో దబిడి దిబిడే అనే స్పెషల్ సాంగ్ చేసి అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా హిందీ సినిమాలు, స్పెషల్ సాంగ్ లో చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె.. ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==