Airtel 5G Plus: మన జీవితంలో ఫోన్, ఇంటర్నెట్, డేటా అన్నీ విడదీయలేని బంధాలుగా మారాయి. మరో విషయం ఏమిటంటే, ముందు సిమ్ కార్డు తీసుకోవాలంటే షాప్‌కి వెళ్లి, లైన్‌లో నిలబడి ఫారం నింపి, ఫోటో ఇవ్వడం, వెరిఫికేషన్ పూర్తి చేయించడం వంటి ఇబ్బందులు ఉండేది. దీని వల్ల ఒక రోజంతా మన సమయం అంతా దానికోసమే అయిపోయేది. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ పూర్తిగా మార్చేసింది ఎయిర్‌టెల్. కస్టమర్ల కోసం సిమ్ కార్డులను ఇంటి వద్దకే డోర్ డెలవరీ చేసేందుకు కొత్త ఆలోచన చేసింది. అంటే మీరు సిమ్ కార్డు కోసం షో రూమ్‌కి వెళ్లాల్సిన పని లేకుండా మీ వద్దకే సిమ్ వస్తుందన్న మాట! అది ఎలా అనుకుంటున్నారా? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
స్టోర్ కి మీరెందుకు మీ ఇంటికి మేమే వస్తాం!
ఎయిర్ టెట్ తీసుకొచ్చిన ఈ సరి కొత్త ఆలోచన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మా స్టోర్ కి మీరెందుకు రావడం (Why visit our store?) అనే ప్రశ్నకు, మేమే మీ దగ్గరకు వస్తాం కదా! అంటూ సమాధానం ఇచ్చింది. దీని వల్ల ఇప్పుడు సిమ్ డెలివరీ ఒక రూపాయి ఖర్చు కూడా లేకుండా, నేరుగా మీ ఇంటికే అందుతుంది. అంటే మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, లైన్‌లో నిలబడాల్సిన ఇబ్బంది లేకుండా, కేవలం ఒక కాల్ లేదా ఆన్లైన్ బుకింగ్ ద్వారా సిమ్ మీ ఇంటికే చేరిపోతుంది.
కొత్త ఆఫర్‌లో ప్రత్యేకత ఏమిటి?
ఇప్పుడు ఈ కొత్త ఆఫర్‌లో ఉన్న ప్రత్యేకతేమిటంటే, దీని వలన మీరు ఒకటే కాదు, రెండు పోస్ట్‌పెయిడ్ సిమ్‌లను పొందవచ్చు. ఒక్కో సిమ్ ధర రూ.350 మాత్రమే. అంతేకాదు, ఈ రెండు సిమ్‌లతో కలిపి మీరు ప్రతి నెలా 105 జీబీ డేటా పొందుతారు. అంటే మొబైల్ వాడకం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియోలు స్ట్రీమింగ్, సోషల్ మీడియా వాడకం అన్నీ సులభంగానే చేయవచ్చు. ఇంతే కాదు, ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ ద్వారా మీ ఇంటర్నెట్ వేగం మరింతగా పెరుగుతుంది. ఇంతకుముందు 4జీలో ఒక సినిమా డౌన్‌లోడ్ అవ్వడానికి కొంత సమయం పట్టేది, కానీ ఇప్పుడు 5జీ ప్లస్‌లో ఆ వేగం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులు, ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులు, గేమింగ్ ఇష్టపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: Samsung Galaxy: సామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా!.. 2026లో మొబైల్ వరల్డ్‌కి రాజు ఇదే!
రెండు సిమ్స్‌లు ఎందుకు?
ఇంకా చెప్పాలంటే, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా, మీ బిల్లు ప్రతి నెల చివరగా ఒకే సారి వస్తుంది. ఇందులో డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ లకు సంబంధించిన మొత్తం బిల్లు కలిపి ఉంటుంది. అందువల్ల మీరు ముందే రీచార్జ్ చేయాల్సిన టెన్షన్ ఉండదు. అంతేకాదు, ఒకేసారి రెండు సిమ్‌లు తీసుకుంటే, ఒకటి మీ వ్యక్తిగతంగా మనం వాడుకోడానికి, మరొకటి కుటుంబ సభ్యుల కోసం వాడవచ్చు. ఇలా ఒక్కసారిగా రెండు సౌకర్యాన్ని కల్పిస్తుంది.
ఇంటి వద్దకే సిమ్ యాక్టివేట్
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎయిర్‌టెల్ ఇప్పుడు ఈ సౌకర్యాన్ని ఇంటి వద్దే కేవైసీతో కలిపి ఇస్తోంది. అంటే సిబ్బంది మీ ఇంటికే వచ్చి అవసరమైన వివరాలు తీసుకుని వెంటనే సిమ్ యాక్టివేట్ చేసి ఇస్తారు. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఈ ఆఫర్‌లో ఇంకో హైలైట్ ఏమిటంటే, జీరో ఎక్స్ట్రా కాస్ట్ (zero extra cost). అవును, సిమ్ డెలివరీ కోసం అదనంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు కేవలం రూ.350 చెల్లిస్తే చాలు, సిమ్ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది.
నెలకు సరిపడ డేటా!
ఇక మనం డబ్బు గురించి ఆలోచిస్తే, ఈ ఆఫర్ చాలా లాభదాయకంగా అని తెలుస్తుంది. సాధారణంగా ఒక సిమ్ రేటు ఎక్కువే. కానీ ఇక్కడ రెండు సిమ్‌లను తీసుకున్నా ఒక్కోటి కేవలం రూ.350 మాత్రమే. అంటే మీ ఖర్చు తక్కువ, కానీ పొందే డేటా మాత్రం ఎక్కువ. 105జీబీ డేటా అంటే ఒక ఇంటికి మొత్తం నెలలో సరిపడేంత డేటా అని చెప్పొచ్చు. ఎయిర్ టెల్ తీసుకొచ్చిన ఈ 5జీ ప్లస్ పోస్ట్‌పెయిడ్ సిమ్ డోర్‌స్టెప్ డెలివరీ ఆఫర్ మన జీవనశైలిని మరింత సులభతరం చేస్తుంది. బయటకు వెళ్లే ఇబ్బంది లేదు, లైన్‌లో నిలబడే టెన్షన్ లేదు, అదనపు ఖర్చు లేదు. రెండు సిమ్‌లతో రెట్టింపు ఆనందం, రెట్టింపు సౌకర్యం. అందుకే ఎయిర్ టెల్ మీ రెందుకు రావడం? మేము మీ వద్దకు వస్తామని చెబుతోంది.