BigTV English

Sonu Sood: మరీ ఇంత గొప్పోడివేంటయ్యా.. ఏకంగా అలాంటి హామీ!

Sonu Sood: మరీ ఇంత గొప్పోడివేంటయ్యా.. ఏకంగా అలాంటి హామీ!
Advertisement

Sonu Sood:చాలామంది సెలబ్రిటీలు సినిమాల ద్వారా డబ్బులు సంపాదించుకొని లక్షల మంది అభిమానులను సంపాదించుకోవడమే కాదు అభిమానులకి ఆపద వస్తే కాపాడడంలో కూడా ముందుంటారు. అభిమానులకు మాత్రమే కాదు మామూలు జనాలకి కూడా ఆపద వస్తే మేమున్నాం అంటూ ముందుకు వస్తారు. అలాంటి వారిలో అందరి కంటే ముందు నటుడు సోనూసూద్ (Sonusood) ఉంటారు. బాలీవుడ్ నటుడు సోనూసూద్ అంటే సౌత్ ఇండస్ట్రీ జనాలకు కూడా సుపరిచితమే.ఈయన దక్షిణాది ఇండస్ట్రీలో విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.అయితే అలాంటి సోనూసూద్ సినిమాల్లో మాత్రమే విలన్ గా చేస్తారు. బయట మాత్రం హీరో.


వరద బాధితులకు అండగా సెలబ్రిటీలు..

కొంతమంది హీరోలు కోట్లు కోట్లు సంపాదించుకొని కేవలం సినిమాల మట్టుకే హీరోగా ఉంటారు.బయట మాత్రం అభిమానుల కోసం, పేదల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయడానికి కూడా ముందుకు రారు. కానీ సోనూ సూద్ మాత్రం సినిమా ద్వారా సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ ఆపద వస్తే పేదలకు ఖర్చు పెట్టడం కోసం ముందుంటారు. అయితే అలాంటి సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. రీసెంట్ గా పంజాబ్లో వచ్చిన భారీ వరదల కారణంగా అక్కడి ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. ఎంతోమంది చనిపోవడంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది.

ఏకంగా అలాంటి హామీ ఇచ్చిన సోనూసూద్..


అయితే పంజాబ్లో వచ్చిన భారీ వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను రీసెంట్గా సోనూసూద్ పర్యటించి అక్కడున్న వారికి హామీలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా అమృత్ సర్ లో పర్యటించిన సోనూ సూద్ అక్కడి వరద బాధితులను పరామర్శించి మీకు ఇల్లు నిర్మిస్తాను అంటూ హామీ ఇచ్చారు.. అయితే వరదల్లో చాలా ఇల్లు కొట్టుకుపోయాయి.కొన్ని కూలిపోయాయి.కొన్ని ఇల్లు ధ్వంసం అయిపోయాయి. దాంతో చాలామంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. జన జీవనం స్తంభించి పోవడంతో ఇదంతా పరిశీలించిన సోనూ సూద్ ఇల్లు కోల్పోయిన వరద బాధితులకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు.మానవతా దృక్పథంతో సోనూ సూద్ తీసుకున్న నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా సోను సూద్ ఇచ్చిన హామీ గురించి బయటపడడంతో చాలామంది సోనూసూద్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు.

సోను సూద్ తో పాటు అక్షయ్ కుమార్ కూడా..

మీలాంటి గొప్ప మనసున్న వాళ్లు ఊరికొక్కరు ఉన్నా చాలు ఇండియాలో పేదరికం అనేది ఉండదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సోనుసూద్ ఇప్పుడు మాత్రమే కాదు కరోనా సమయం నుండే సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కరోనా టైంలో ఆయన చేసిన సహాయాన్ని ఎంతోమంది కొనియాడారు కూడా. అలా ఆపద వస్తే సహాయం చేయడంలో ముందుంటున్న సోనుసూద్ ప్రతిసారి వార్తల్లో నిలుస్తున్నారు. సోను సూద్ మాత్రమే కాకుండా కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పంజాబ్ వరద బాధితులకు తమ వంతు సహాయం చేశారు. అలా అక్షయ్ కుమార్ కూడా తన వంతుగా రూ.5కోట్ల విరాళం ప్రకటించారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ALSO READ:Bigg Boss 9: బిగ్ బాస్ 9 ఫైనల్ కంటెస్టెంట్స్ జాబితా ఇదే..6గురు సామాన్యులతో పాటు!

Related News

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

Fauzi Movie: ప్రభాస్ ఫౌజీలో మరో ముద్దుగుమ్మ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటి!

Puri Sethupathi: ఆగిపోయిన పూరీ-సేతుపతి.. నిర్మాణ సంస్థ క్లారిటీ!

Big Stories

×