BigTV English

Bigg Boss: బిగ్ బాస్ కు కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసా?

Bigg Boss: బిగ్ బాస్ కు కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసా?
Advertisement

Bigg Boss:బిగ్ బాస్ (Bigg Boss).. హిందీ మొదలుకొని తెలుగు వరకు చాలా భాషలలో ఈ రియాలిటీ షో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా తమ ఉనికిని నిరూపించుకుంటూ టైటిల్ దిశగా అడుగులు వేస్తున్నారు. అటు హిందీలో 19వ సీజన్ ప్రారంభం అవ్వగా.. ఇటు తెలుగులో తొమ్మిదవ సీజన్ సెప్టెంబర్ 7 సాయంత్రం 7:00 ఘనంగా లాంచ్ కాబోతోంది. ఈ షోపై ఈసారి సరికొత్త అంచనాలు నెలకొన్నాయి.. ముఖ్యంగా కామన్ మ్యాన్ క్యాటగిరిలో ఏకంగా 6 మందిని హౌస్ లోకి తీసుకోబోతున్నారు. మరొకవైపు యూట్యూబ్, సోషల్ మీడియా, సినిమాలు, సీరియల్ ద్వారా పాపులారిటీ అందుకున్న వారిని కూడా హౌస్ లోకి కంటెస్టెంట్ గా తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఒక లిస్టు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.


బిగ్ బాస్ కి ఎలా సెలెక్ట్ చేస్తారు?

ఇకపోతే ఎప్పుడూ కూడా బిగ్ బాస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎవరు హౌస్ లోకి అడుగుపెడతారు? ఎవరిని తీసుకోబోతున్నారు? ఈసారి ఎలాంటి టాస్కులు పెడతారు? ఇలా ప్రతి ఒక్కరు వీటి గురించి ఆలోచిస్తారే తప్ప.. అసలు బిగ్ బాస్ కి కంటెస్టెంట్స్ ను ఎలా ఎంపిక చేస్తారు అనే విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. కానీ ఈ ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకోవడానికి చాలామంది క్యూరియాసిటీ కూడా కనబరుస్తూ ఉంటారు. మరి ఈరోజు ఆ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ను ఎలా ఎంపిక చేస్తారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా జరుగుతుందంటే?


సాధారణంగా ఏ భాషలో అయినా సరే కంటెంట్ ఉండే షోని మాత్రమే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే కంటెంట్ ఇవ్వగలిగే వ్యక్తులను మాత్రమే నిర్వాహకులు బిగ్ బాస్ కి సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న వారిని ఎక్కువగా ఎంచుకుంటారు. ఒక్కొక్కసారి పూర్తిగా వేరువేరుగా ఆలోచించే ఇద్దరిని కూడా హౌస్ లోకి పంపిస్తారు. అలా చేస్తే వారి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. దీనికి తోడు వారికి బయట ఉన్న గుర్తింపును కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అంటే ఆ వ్యక్తి కోసం బిగ్ బాస్ చూడాలనుకుంటారు కదా.. అలాంటి వాళ్ళను కూడా నిర్వాహకులు సెలెక్ట్ చేస్తారు.

అలాంటి వారైతేనే షో కి గుర్తింపు..

ముఖ్యంగా మనకు కనిపించే 100 ఎపిసోడ్స్ కి ముందు ఇంకెన్నో రోజుల ప్రాసెస్ జరుగుతుంది. నిజానికి అందర్నీ సెలబ్రిటీలనే సెలెక్ట్ చేస్తే షో కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అందుకే ఫేమ్ ఉన్నవారితో పాటు అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేయగలిగే వ్యక్తులను కూడా ఎంపిక చేసుకుంటారు. పైగా టాప్ ఫేమ్ ఉన్న వారి పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే ఎక్కువ ఫేమ్ ఉన్న వారిని హౌస్ లోకి తీసుకొచ్చిన తర్వాత వారి బిహేవియర్ వల్ల వారి కెరియర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది . ఇప్పటికే ఇలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అలా చేయకుండా సామాన్యులను కూడా ఎంటర్టైన్ చేయగలిగే వారిని, తక్కువ ఫేమ్ ఉన్న వారిని కూడా ఇప్పుడు హౌస్ లోకి తీసుకోబోతున్నారు. ఇలా ఎంపిక చేయబడే కంటెస్టెంట్లు.. హౌస్ లో ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారని చెప్పవచ్చు.

ALSO READ:Tollywood: పెళ్లి చేసుకోమని వేధిస్తున్న అభిమాని.. దెబ్బకు హీరోయిన్ ఏం చేసిందంటే?

Related News

Akhanda 2: ‘అఖండ 2’ నుంచి బిగ్ లీక్… హిందూపురం ఎమ్మెల్యే పాత్రలో బాలయ్య

Tollywood Heroines : సినిమాల్లోకి రాకముందు సీరియల్స్ చేసిన టాప్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Spirit : కేవలం పోలీస్ కాదు ఖైదీ కూడా, సందీప్ రెడ్డి వంగ గట్టిగానే ప్లాన్ చేశాడు

Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Big Stories

×