ఈ రోజుల్లో పెళ్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సినిమా సెట్స్ ను తలపించే సెట్టింగ్స్ తో రిసెప్షన్ వేడుకలను అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు. కళ్లు చెదిరేలా విద్యుత్ వెలుగులు, డ్రై ఐస్ పొగల నడుమ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఎంట్రీని సినిమా రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. తాజాగా ఓ జంటకు వెడ్డింగ్ ప్లానర్స్ అలాంటి ఎంట్రీ ప్లాన్ చేశారు. కానీ, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును మోయలేక బొక్కబోర్లా పడటంతో అందరూ షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. ఫంక్షన్ హాల్ లోపలికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాలి. బంధువులు పూలు చల్లుతుంటే ఆమెను స్టేజ్ మీదకి తీసుకెళ్లాలి. వెనుక నుంచి డ్రై ఐస్ పొగలు వస్తుంటే సినిమా సెట్టింగ్ రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వాలనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. ఈ వీడియోలో వరుడు నల్లటి షేర్వానీ ధరించి, వధువు పక్కన నిలబడి ఉంటాడు. వధువు సాంప్రదాయ ఎరుపు రంగు లెహంగాలో కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఆభరణాలు, మేకప్ తో ఆకట్టుకుంటుంది. వరుడు వంగి తన వధువును తన చేతుల తోటి పైకి ఎత్తుకుంటాడు. రెండు మెట్లు ఎక్కుతాడు. వధువు ఎంబ్రాయిడరీ లెహంగా బరువుగా ఉంటుంది. పెళ్లి కొడుకు ఆమెను ఎత్తుకుని బ్యాలెన్స్ కోల్పోతాడు. ఒక్కసారిగా వధువుతో కలిసి కిందపడిపోతాడు.
పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కిందపడటంతో వెంటనే బంధువులు కంగారుగా అక్కడికి చేరుతారు. వధూవరులను పైకి లేపుతారు. ఆ క్షణం కొత్త జంట సిగ్గుతో తలదించుకుంటారు. అందరి ముందు చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. వారి జీవితంలో మర్చిపోలేని చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 4న షేర్ చేయబడిన ఈ వీడియో ఇప్పటికే 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. 35,000 కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. బోలెడు ఫన్ కామెంట్స్ వచ్చాయి.
Read Also: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!
ఈ వీడియోను చూసి నెటిజన్లు హిలేరియస్ కామెంట్ చేస్తున్నారు. “బ్రోకు జిమ్ అవసరం” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “పాపం.. కొత్త జంటకు జీవితంలో మర్చిపోలేని చేదు జ్ఞాపకం ఏర్పడింది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ముందు రీహార్సల్స్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది. ముందే ట్రయల్స్ వేస్తే బాగుండేది”. “పెళ్లి రోజు హ్యాపీగా ఉండక ఎందుకు ఇలాంటి స్టంట్లు” అని మరో కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: అబ్బా.. ఎవరీ హ్యాండ్సమ్.. నెట్టింట వైరల్ అవుతున్న రైల్వే టీసీ వీడియో!