BigTV English

Ginger Water: మందులు అవసరమే లేదు.. అల్లం నీరు ఇలా వాడితే వ్యాధులన్నీ పరార్

Ginger Water: మందులు అవసరమే లేదు.. అల్లం నీరు ఇలా వాడితే వ్యాధులన్నీ పరార్


Ginger Water: అల్లం ప్రతి రోజు మనం వంటకాల తయారీలో వాడుతూనే ఉంటాం. ఇది ఆహారానికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా.. శతాబ్దాలుగా అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అల్లం నీరు లేదా అల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలిసినవే. జీర్ణక్రియ మెరుగుపరచడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, వాపును తగ్గించడం వంటి అనేక లాభాలు దీనిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అల్లం నీరు తాగే వారు ఏ సమయంలో తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఉదయం.. సాయంత్రం లేదా భోజనానికి ముందు.. ఏ సమయం ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రయోజనాలు:


జీవక్రియను వేగవంతం చేస్తుంది: ఉదయం ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగడం వల్ల జీవక్రియ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా సహాయ పడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: అల్లంలోని సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజ పరుస్తాయి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమై.. రోజంతా తేలికగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

వికారాన్ని తగ్గిస్తుంది: కొంతమందికి ఉదయం పూట వికారం, వాంతులు అవుతాయి. అలాంటి వారికి అల్లం నీరు మంచి పరిష్కారం. గర్భిణీ స్త్రీలకు వచ్చే ‘మార్నింగ్ సిక్‌నెస్’ను తగ్గించడంలో కూడా ఇది సహాయ పడుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తొలగించి, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీంతో జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.

సాయంత్రం లేదా రాత్రి భోజనం తర్వాత అల్లం నీరు తాగడం:

అల్లం నీరు కేవలం ఉదయం మాత్రమే కాదు.. సాయంత్రం కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

ప్రయోజనాలు:

జీర్ణక్రియకు సహాయపడుతుంది: రాత్రి భోజనం ఎక్కువగా చేసినప్పుడు, జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. భోజనం తర్వాత ఒక కప్పు అల్లం నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శాంతించి, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.

ప్రశాంతమైన నిద్ర: అల్లంలో ఉండే కొన్ని పదార్థాలు శరీరానికి విశ్రాంతినిస్తాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని అల్లం నీరు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది: చలికాలంలో రాత్రి పడుకునే ముందు అల్లం నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది వెచ్చదనాన్నిచ్చి, హాయిగా నిద్రపోవడానికి సహాయ పడుతుంది.

Also Read: ముఖంపై నల్ల మచ్చలా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

అల్లం నీరు ఎలా తయారు చేయాలి ?

అల్లం నీరు తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక చిన్న అల్లం ముక్కను శుభ్రం చేసి, సన్నని ముక్కలుగా కోయండి లేదా తురమండి. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని, అందులో అల్లం ముక్కలు వేసి మరిగించండి. సుమారు 5-10 నిమిషాలు మరిగిన తర్వాత, నీటిని వడపోసి కప్పులోకి తీసుకోండి. రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.

ముఖ్య గమనిక:

అల్లం నీరు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. రోజుకు 2-3 కప్పులకు మించి తాగకపోవడం మంచిది. అలాగే.. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు లేదా గర్భిణీలు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే అల్లం నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

Related News

Aluminium Utensils: అల్యూమినియం పాత్రలు వాడితే.. ఇంత డేంజరా ? ఈ రోజే బయట పడేయండి

Using Phone In Toilet: టాయిలెట్‌లో కూడా ఫోన్ వాడుతున్నారా ? ఈ వ్యాధి బారిన పడటం ఖాయం

Dark Spots: ముఖంపై నల్ల మచ్చలా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Artificial Sweeteners: ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు వాడుతున్నారా? అవి మీ మెదడును ఏం చేస్తాయో తెలుసా?

Coconut Water: కొబ్బరి నీళ్ళు నేరుగా తాగకూడదా? అమ్మో.. ఇంత డేంజర్ అని అస్సలు తెలియదే!

Big Stories

×