Mirai Gets Huge Profit: సూపర్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’. మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల జాబితాలో మిరాయ్ మొదటి స్థానంలో ఉంది. ట్రైలర్తో ఈ మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. మూవీలో చూపించిన విజువల్స్ ఆడియన్స్‌ని అబ్బురపరిచాయి. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ విజువల్స్తో కార్తిక్ ఘట్టమనేని వండర్ చేశాడంటున్నారు. ఇక సూపర్ తేజ సజ్జా పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీజర్, ట్రైలర్కు వచ్చిన రెస్పాన్స్తో మిరాయ్పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ రిలీజ్ తర్వాత మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో మిరాయ్.. ఐఎండీబీలో టాప్ ప్లేస్‌కి వచ్చింది.
దీంతో మూవీపై ఎంతగా అంచనాలు ఉన్నాయనేది అర్థమైపోతుంది. దీంతో విడుదలకు ముందే ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తుంది. ప్రస్తుతం పెద్ద సినిమాలు సైతం థియేటర్లలోకి రాకముందే తడబడుతున్నాయి. కానీ, ఈ కుర్ర హీరో సినిమా మాత్రం విడుదలకు ముందే సంచలనం క్రియేట్ చేస్తోంది. అగ్ర హీరో, భారీ నిర్మాణ సంస్థ ఉన్నప్పటి ఆ సినిమా ఫలితం తేలేవరకు ఓటీటీలు ముందుకు రావడం లేదు. కానీ, మిరాయ్ సినిమా రిలీజ్ ముందే ఓటీటీ డీల్ పూర్తి చేసుకోవడం విశేషం. ఇప్పుడు ఈ మూవీ మరో రికార్డు బ్రేక్ చేసింది. రిలీజ్కు ముందే ఈ సినిమా లాభాల బాట పట్టింది. మిరాయ్ నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 45 కోట్లు పలికిందట.
ఒక యంగ్ హీరో సినిమా ఈ రేంజ్లో బిజినెస్ చేయడం సాధారణ విషయం కాదు. దీంతో రూ. 20 కోట్ల ప్రాఫిట్తో మేకర్స్ ఈ సినిమా థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. ఇక మిరాయ్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఇండస్ట్రీలో వర్గాలు షాక్ అవుతున్నాయి. ట్రేడ్ వర్గాలు సైతం సర్ప్రైజ్ అవుతున్నాయట. ప్రస్తుతం సినీ పరిశ్రమ పరిస్థితి డైలామాలో ఉంది. వెయ్యి కోట్లు రాబడతాయనుకున్న చిత్రాలు సైతం ఢిలా పడుతున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు కూడా ఈ రేంజ్లో బిజినెస్ చేయడం లేదు. కనీసం పెట్టిన బడ్జెట్ని తీసుకురావడానికి కష్టపడుతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో ఓ కుర్ర హీరో సినిమా ఈ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం మామూలు విషయం కాదు. విడుదలకు ముందే మిరాయ్ లాభాలు తెచ్చిపెట్టడం టాలీవుడ్కి మంచి బూస్ట్ ఇచ్చిందని అంటున్నారు.
‘ఈగల్’ ఫేం కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా లీడ్ రోల్‌లో నటించని ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. శ్రియ శరణ్ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇందులో ఆమె తేజ సజ్జాకు తల్లిగా పవర్‌ఫుల్ తల్లి రోల్ పోషించింది. రితికా నాయక్ హీరోయిన్గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. మిరాయ్కి సుమారు రూ. 60 కోట్ల వ్యయంతో రూపొందించినట్టు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్లోనే క్యాలిటీ వీఎఫ్ఎక్స్తో మిరాయ్ని విజువల్ వండర్‌గా తెరకెక్కించాడు కార్తిక్ ఘట్టమనేని. ఈ సినిమాను యాక్షన్-అడ్వెంచర్గా సూపర్ హీరో జానర్లో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న సుమారు పదమూడు భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్గా విడుదల కాబోతోంది.