BigTV English

Film industry: ప్రముఖ సినీ దర్శకుడు అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

Film industry: ప్రముఖ సినీ దర్శకుడు అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

Film industry:ప్రముఖ మాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సనల్ కుమార్ శశిధరన్ (Sanal Kumar Sasi Dharan) ను ముంబై ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యంగా జనవరిలో ప్రముఖ మలయాళ నటిని సోషల్ మీడియాలో వేధించినందుకు.. ఈయనపై ఎలమక్కర పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ సమయంలో ఆయన అమెరికాలో ఉన్నారు. దీంతో ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే భారత్ కు వచ్చిన శశిధరన్ ను ముంబై ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి విచారణలో శశిధరన్ ఎలాంటి సమాధానం తెలియజేస్తారో చూడాలి.


అసలేం జరిగిందంటే?

అసలు విషయంలోకి వెళితే.. 2022లోనే ఒకసారి ఈయన అరెస్ట్ అయ్యారు. సనల్ కుమార్ శశిధరన్ సోషల్ మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ చేసి తన ప్రతిష్టను దిగజార్చారు అని ప్రముఖ నటి మంజు వారియర్ (Manju warrior) దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈయనను తిరువనంతపురంలోని నెయ్యట్టింకరలో అదుపులోకి తీసుకున్నారు. కానీ ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనే విషయం పై అప్పుడు పోలీసులు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.


పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..

కానీ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నటి మంజు వారియర్ ను ఈయన బ్లాక్మెయిల్ చేశాడని ఆమె ఫిర్యాదు చేసిందట. అది తెలుసుకున్న అతడు ఫేస్బుక్ లైవ్ లో మంజు ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపించాడు. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. నిజానికీ మంజు వారియర్ ప్రాణాలకు ముప్పు ఉందని.. స్వార్ధ ప్రయోజనాల కోసం వేరే వ్యక్తుల నియంత్రణలోకి ఆమె వెళ్లిపోతోందని ఆరోపిస్తూ.. ఆమె మేనేజర్లపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. పైగా 2022 కేరళలో జరిగిన వివిధ సంఘటనలకు సంబంధించి భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా తాను లేఖ రాసినట్లు శశిధరన్ తెలిపారు. కానీ ఇతడు పోస్టులపై నటి మంజు వారియర్ స్పందించలేదు. పైగా ఇతడిపై ఆమె పోలీసులకు 2022 మే 5న ఫిర్యాదు కూడా చేసింది. తర్వాత ఈ ఏడాది జనవరిలో కూడా ఈయన సోషల్ మీడియాలో ఆమెను హింసించారట. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. అప్పటినుంచి విదేశాలలోనే ఉన్న ఈయన ఇప్పుడు ఇండియాకి రావడంతో అరెస్టు చేశారు.

సనల్ కుమార్ శశిధరన్ కెరియర్..

ఈయన కెరియర్ విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో వచ్చిన మలయాళ చిత్రం ‘మంకోలంగల్’ లో ఆర్ట్ అసిస్టెంట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత ‘వండర్ వరల్డ్’ అనే లఘు చిత్రాన్ని నిర్మించారు. ఒకవైపు రచయితగా.. మరొకవైపు నిర్మాతగా.. దర్శకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఉత్తమ దర్శకుడిగా 2014లో అవార్డును కూడా అందుకున్నారు. ముఖ్యంగా ఈయన చిత్రాలకు కూడా పలు అవార్డులు లభించాయి. అలాంటి ఈయన ఇప్పుడు నటిని వేధించిన కేసులో ఇరుక్కోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.

ALSO READ:Sonu Sood: మరీ ఇంత గొప్పోడివేంటయ్యా.. ఏకంగా అలాంటి హామీ!

Related News

TVK Vijay: తలపతి విజయ్ పార్టీ పైన త్రిష ఆసక్తికర కామెంట్స్

Pookie: సోషల్ మీడియా దెబ్బకి పూకి ను కాస్త బూకి చేశారు

Prabhas: డైరెక్టర్ రెడీ.. ఈస్క్రిప్ట్ రెడీ.. కానీ ప్రాబ్లం అంతా హీరోనే

Urvashi Rautela: అభిమాని ఫోన్ లాగేసుకున్న ఊర్వశీ.. అసలు ఏమైందంటే?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Big Stories

×