E-Paper
Advertisement

నిఖిల్ సిద్ధార్థ్ బర్త్‌డే స్పెషల్.. ‘ది ఇండియా హౌస్’ నుండి పోస్టర్ రిలీజ్!

నిఖిల్ సిద్ధార్థ్ బర్త్‌డే స్పెషల్.. ‘ది ఇండియా హౌస్’ నుండి పోస్టర్ రిలీజ్!
Advertisement

The India House: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’ (The India House) టీమ్ ఒక ప్రత్యేకమైన బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో నిఖిల్ క్లాసీ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌లో ఆయనను ‘మన శివ’ అని పేర్కొంటూ చిత్రబృందం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

Read also-మాస్ మహారాజ్ రవితేజ ‘ఇరుముడి’ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?..

రామ్ చరణ్ సమర్పణలో..

Advertisement

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించిన నూతన నిర్మాణ సంస్థ ‘వి మెగా పిక్చర్స్’ సమర్పణలో వస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ-2’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

1905 నాటి లండన్ నేపథ్యం

ఈ చిత్రం భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ కాలం నాటి చారిత్రక ఘట్టాల ఆధారంగా తెరకెక్కుతోంది. 1905వ సంవత్సరంలో లండన్ నగరంలోని ‘ఇండియా హౌస్’ వేదికగా జరిగిన విప్లవాత్మక పరిణామాలు, రాజకీయ అలజడుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ముఖ్యంగా వీర సావర్కర్ లండన్ ప్రయాణం, ఆ కాలంలోని యువ విప్లవకారుల జీవితాలు, వారి త్యాగాలతో పాటు ఒక ఎమోషనల్ ప్రేమకథను కూడా ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారు.

Advertisement

Read also-అనుష్కకు హ‌గ్ ఇచ్చిన దినేష్ కార్తీక్‌..కోహ్లీ సీరియ‌స్ లుక్స్ వైర‌ల్ !

ప్రధాన తారాగణం

ఈ చిత్రానికి రామ్ వంశీ కృష్ణ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ సరసన కథానాయికగా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా, బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. కేమరాన్ బ్రైసన్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే హంపిలోని చారిత్రక విరూపాక్ష ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘కార్తికేయ-2’తో నేషనల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, ఈ విప్లవాత్మక పీరియడ్ డ్రామాతో మరోసారి పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×