E-Paper
Advertisement

Indian Railways: స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీలో ప్రయాణించాలనుందా? సింపుల్ గా ఇలా చేయండి!

Indian Railways:  స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీలో ప్రయాణించాలనుందా? సింపుల్ గా ఇలా చేయండి!
Advertisement

IRCTC Auto Upgradation: భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు  కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తక్కువ ధరలో ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేసేందుకు కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. అందులో భాగంగానే స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీ కోచ్ లో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దానిపేరే ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్. ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటి? స్లీపర్ టికెట్ తో ఏసీ ప్రయాణం చేసేలా ఎలా ఉపయోగపడుతుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

స్లీపర్ టికెట్ తో ఏసీ క్లాస్ ప్రయాణం

వాస్తవానికి, ఎక్కువ ఛార్జీల కారణంగా, రైళ్లలోని టాప్ క్లాస్ కోచ్ లు అయిన AC1, AC2  తరచుగా ఖాళీగా ఉంటాయి. ఈ ఖాళీ బెర్తుల కారణంగా రైల్వేకు పెద్ద మొత్తంలో నష్టం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ నష్టాన్ని నివారించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆటో అప్‌గ్రేడ్ పథకాన్ని ప్రారంభించాయి. ఈ పథకం ప్రకారం ఏసీ కోచ్ లో బెర్త్ ఖాళీగా ఉంటే,  దిగువ తరగతి నుంచి  ప్రయాణీకుడిని పై తరగతికి అప్‌ గ్రేడ్ చేస్తారు.

ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్ ఎలా పని చేస్తుంది?

Advertisement

ఒక రైలులో ఫస్ట్ ACలో నాలుగు ఖాళీ సీట్లు, సెకండ్ ACలో రెండు ఖాళీ సీట్లు ఉన్నాయని అనుకుందాం. సెకండ్ ACలోని కొంతమంది ప్రయాణీకులను ఫస్ట్ ACకి అప్‌గ్రేడ్ చేస్తారు. థర్డ్ ACలోని ప్రయాణీకులను సెకండ్ ACకి అప్‌గ్రేడ్ చేస్తారు. దీని వలన థర్డ్ ACలో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటాయి. ఇది థర్డ్ ACలో వెయిటింగ్ లిస్ట్‌ లో ఉన్న ప్రయాణీకులకు లాభం కలిగిస్తుంది. ఈ విధంగా రైలులోని ఏ కోచ్‌లోనూ బెర్తులు ఖాళీగా ఉండవు. రైల్వేకు నష్టం కలగదు.

ఎవరి టికెట్లు అప్ గ్రేడ్ అవుతాయంటే?

టికెట్ బుక్ చేసుకునేటప్పుడు,  ప్రయాణీకుడిని ఆటో అప్‌ గ్రేడ్‌ను అనుమతించడానికి సిద్ధంగా ఉన్నారా? అని IRCTC అడుగుతుంది. ‘అవును’ అనే ఆప్షన్ ను ఎంచుకుంటే మీ టికెట్ అప్‌ గ్రేడ్ చేయబడుతుంది. మీరు ‘లేదు’ సెలెక్ట్ చేస్తే పైతరగతులకు పంపే అవకాశం ఉండదు.

Advertisement

Read Also:  జయహో పాట పాడేస్తున్న రోడ్డు.. ఇదేంది బాసూ ఇంత వింతగా ఉంది!

 PNR నెంబర్ మారుతుందా?

అప్‌ గ్రేడ్ తర్వాత ప్రయాణీకుడి PNR స్టేటస్ లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రయాణీకులు ఏదైనా ప్రయాణ సంబంధిత సమాచారం కోసం వారి అసలు PNR స్టేటస్ ను ఉపయోగిస్తారు. అయితే, అప్‌ గ్రేడ్ తర్వాత వారు తమ టికెట్‌ను రద్దు చేసుకుంటే, అప్‌ గ్రేడ్ చేసిన తరగతి ఆధారంగా కాకుండా వారి అసలు టికెట్ ఆధారంగా వారికి రీఫండ్ లభిస్తుంది.

Read Also:  ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ లో ఇక ఎమర్జెన్సీ కోటా టికెట్లు!

Related News

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

Big Stories

Advertisement
×