E-Paper
Advertisement

Toxic Film: టాక్సిక్ సినిమాను చుట్టు ముట్టిన వివాదాలు.. క్రైస్తవ మతస్థుల నుంచి ఎదురు దెబ్బ!

Toxic Film: టాక్సిక్ సినిమాను చుట్టు ముట్టిన వివాదాలు.. క్రైస్తవ మతస్థుల నుంచి ఎదురు దెబ్బ!
Advertisement

Yash Toxic Film: కేజిఎఫ్ స్టార్ యశ్ (Yash) నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్(Toxic) ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. గీతు మోహన దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం కూడా ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇటీవల హీరో పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ వీడియో ఎన్నో వివాదాలకు కారణమైంది. ఇలా ఈ టీజర్ వీడియో ద్వారా ఈ చిత్రం వివాదాలలో నిలిచింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకలోని వేల చెట్లను నాశనం చేసి చిత్రీకరణ చేశారని ఆరోపణలు రావడంతో అటవీ శాఖ ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.

క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసేలా

ఈ దర్యాప్తులో భాగంగా చెట్లను నరికి వేశారని నిర్ధారణ కావడంతో చిత్ర నిర్మాతలపై అలాగే భూమిని లీజుకు ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేశారు. ఇలా ఇప్పటికే వరుస వివాదాలు ఉన్నప్పటికీ తాజాగా ఈ సినిమాపై క్రైస్తవ మతస్తుల నుంచి పూర్తిగా వ్యతిరేకత ఏర్పడింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు క్రైస్తవ మతస్తులను అగౌరవపరిచేలా ఉన్నాయి అంటూ క్రైస్తవ మతస్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు . ఈ సినిమా విడుదల అయ్యే సమయానికి ఈ సన్నివేశాలపై సరైన చర్యలను తీసుకోవాలి అంటూ అధికారులకు నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ లేఖ సమర్పించారు.

వెంటనే క్షమాపణలు చెప్పాలి..

Advertisement

క్రైస్తవ మతంలో ప్రధాన దేవదూత అయిన సెయింట్ మైఖేల్ చిత్రీకరణపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సన్నివేశాలు క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వెంటనే ఈ సినిమా నుంచి ఈ సన్నివేశాలను తొలగించి చిత్ర బృందం వెంటనే క్రైస్తవులకు క్షమాపణలు చెప్పాలని లేకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాము అంటూ తెలియజేశారు. క్రైస్తవ మతస్తుల నుంచి ఈ సినిమా పట్ల ఎదురవుతున్నటువంటి ఈ అభ్యంతరాలపై చిత్ర బృందం ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు కానీ ఇది కాస్త సంచలనంగా మారింది.

Advertisement

ఇలా ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద ఎత్తున వివాదాలలో నిలవడంతో అభిమానులు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా చుట్టూ ఇన్ని వివాదాలు ఉన్న నేపథ్యంలో అనుకున్న సమయానికే ఈ సినిమా విడుదల అవుతుందా? లేదంటే విడుదలను అడ్డుకుంటారా? అనే విషయాలపై సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం ఏ విధంగాను స్పందించలేదు. ఇక ఈ సినిమాలో యష్ జోడీగా కియారా అద్వానీ నటించగా, తారాసుతారియా, నయనతార, రుక్మిణి వసంత్ తదితరులు కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Arjun Sarja:  పొలిటికల్ ఎంట్రీ పై అర్జున్ సర్జా కామెంట్స్..జ్ఞానం కూడా కావాలిగా అంటూ!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×