E-Paper
Advertisement

2026లో ‘పెద్ది’తర్వాత పెద్ద సినిమాలు లేనట్లే!.. టాలీవుడ్ స్టార్ హీరోల ‘నెక్స్ట్ లెవెల్’ లైనప్!

2026లో ‘పెద్ది’తర్వాత పెద్ద సినిమాలు లేనట్లే!.. టాలీవుడ్ స్టార్ హీరోల ‘నెక్స్ట్ లెవెల్’ లైనప్!
Advertisement

Tollywood Lineup 2027: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 హంగామా ఒక కొలిక్కి వచ్చింది. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘PEDDI’ మూవీ రిలీజ్‌తో, 2026కి సంబంధించిన టాలీవుడ్ బిగ్ స్టార్స్ చిత్రాల సందడి ముగిసినట్లయింది. అయితే, ఇక్కడితో ఆట అయిపోలేదు.. అసలు సిసలైన పాన్ ఇండియా రేస్ రాబోయే రెండేళ్లలో చాలా పక్కాగా ప్లాన్ చేశారు మన స్టార్ హీరోలు. 2027, 2028 సంవత్సరాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే ఆ క్రేజీ లైనప్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Read also-‘పెద్ది’ వీకెండ్ కలెక్షన్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రామ్ చరణ్ కెరీర్ లోనే..

Advertisement

2027.. బాక్సాఫీస్ వద్ద దండయాత్ర!

వచ్చే ఏడాది (2027) టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఇయర్‌గా మారబోతోంది. ఎందుకంటే కళ్ళు చెదిరే కాంబినేషన్లలో క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఆ ఏడాదిలోనే రిలీజ్ కు లైన్ లో ఉన్నాయి.

Advertisement

ప్రభాస్ ‘డబుల్ అటాక్’: రెబల్ స్టార్ ప్రభాస్ 2027లో రెండు భారీ చిత్రాలతో బాక్సాఫీస్‌పై దండెత్తబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘SPIRIT’, అలాగే హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘Fauzi’ రెండు కూడా 2027 రిలీజ్ కే ఫిక్స్ అయ్యాయి.

ఎన్టీఆర్ ‘డ్రాగన్’: ‘దేవర’ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘DRAGON’ సైతం 2027 లోనే థియేటర్లను రూల్ చేయనుంది.

అల్లు అర్జున్ ‘రాకా’: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘Raaka’ కూడా 2027 టార్గెట్‌తోనే శరవేగంగా సిద్ధమవుతోంది.

మహేష్ బాబు ‘వారణాసి’: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘వారణాసి’ ప్రాజెక్ట్ కూడా 2027 లోనే గ్రాండ్ గా థియేటర్లలోకి అడుగుపెట్టనుంది.

Read also-ఒకప్పుడు చాక్లెట్లు అమ్మిన అమ్మాయి.. నేడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్!

2028 టార్గెట్.. రామ్ చరణ్ – సుకుమార్ క్రేజీ కాంబో!

మరోవైపు, ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ప్లాన్ చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారు.

షెడ్యూల్ అప్‌డేట్: ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ 2026 సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత 2027 అంతా ఎలాంటి బ్రేక్స్ లేకుండా లాంగ్ షెడ్యూల్స్ తో నిరంతరాయంగా షూటింగ్ జరుపుకోనుంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని, ఒక విజువల్ వండర్ లాగా ఈ చిత్రాన్ని 2028 లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మొత్తానికి 2026 పెద్ద సినిమాల సీజన్ ముగిసినప్పటికీ.. రాబోయే రెండేళ్ల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించే లైనప్ గట్టిగానే సెట్ అయింది. సినిమా లవర్స్ కు ఇక థియేటర్లలో పండగే!

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×