E-Paper
Advertisement

మౌనీరాయ్ తో డేటింగ్.. అసలు నిజం బయటపెట్టిన అర్జున్!

మౌనీరాయ్ తో డేటింగ్.. అసలు నిజం బయటపెట్టిన అర్జున్!
Advertisement

Mouni Roy:నాగిన్ సీరియల్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల తన భర్త సూరజ్ నంబియార్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలయ్యింది. అయితే ఈ జంట మాత్రం పరస్పర అవగాహనతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని, ఈ కష్టతర సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని ఒక ప్రకటనలో కూడా కోరారు.

భర్తకు విడాకులు.. సహనటుడితో డేటింగ్..

అయితే భర్త నుంచి మౌనీ రాయ్ విడిపోయినప్పటికీ.. నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ . దీనికి కారణం నాగిన్ సీరియల్ జోడి అర్జున్ బిజ్లానీతో ఈమె గాఢంగా పీకల్లోతు ప్రేమలో ఉందని.. అందుకే తన భర్తకు విడాకులు ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్లు ప్రచారమయ్యాయి. దీనికి తోడు ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక డిన్నర్ పార్టీలో కూడా కలిసి కనిపించారు. అంతేకాదు ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ అయిన కొన్ని ఫోటోలు కూడా అలాంటి అనుమానాలను రేకెత్తించాయి. ఇక దీంతో ఇతడి కోసమేనా తన భర్తకు విడాకులు ఇచ్చింది అంటూ మౌనీ రాయ్ పై ఒక రేంజ్ లో నెటిజన్స్ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.

రూమర్స్ పై ఘాటుగా స్పందించిన అర్జున్..

Advertisement

ఇకపోతే రూమర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో అసలు విషయంపై స్పందించారు ప్రముఖ నటుడు అర్జున్ బిజ్లానీ. ఈ రూమర్లపై తాజాగా స్పందిస్తూ.. ఒక పోస్ట్ ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. “మా మధ్య 15 సంవత్సరాల స్వచ్ఛమైన స్నేహబంధం ఉంది. ఈ బంధాన్ని మీ వికృత చూపులతో తప్పుగా చిత్రీకరించవద్దు” అంటూ హెచ్చరిస్తూ ఒక ఘాటైన పోస్టు కూడా పెట్టారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అర్జున్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి ఆ మెసేజ్ ని డిలీట్ చేశారు. అయితే అప్పటికే అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.

ALSO READ:గొప్ప మనసు చాటుకున్న అనిల్ రావిపూడి.. చిన్నారి తల్లికి అండగా!

నిజమైన స్నేహితుడికి అర్థం లేకుండా చేస్తున్నారు..

Advertisement

ఆ పోస్టులో అర్జున్ క్లిక్ బైట్ వెబ్ సైట్ లపై మండిపడ్డారు.” 15 ఏళ్లకు పైగా మంచి స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కేవలం ఏదో ఒక గాసిప్ పేజీ హెడ్ లైన్ కోసం రాత్రికి రాత్రి ప్రేమికులుగా మారిపోరు “అంటూ స్పష్టం చేశారు. ఒక స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడడం సహజమే.. అంతే కానీ ప్రతి స్నేహానికి వ్యూస్ కోసం ప్రేమరంగు పులమాల్సిన అవసరం లేదు అంటూ మండిపడ్డారు అర్జున్. మీరు రాసే ప్రతి వార్త నిజానిజాలు తెలుసుకోకుండా రాస్తే జర్నలిజం అనే నమ్మకానికి మాయని మచ్చ. అందుకే ఏదైనా వార్త రాసే ముందు కనీసం నిజానిజాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది అంటూ అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే 15 ఏళ్ల స్నేహ బంధాన్ని తప్పుడు మార్గంలో చిత్రీకరించి వార్తలు రాయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

దిల్ రాజు పంచాయితీ వర్కవుట్ కాలేదా? డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ముదురుతున్న రచ్చ!

గణిత మేధావి రామానుజన్‌కు ప్రీతి ముకుందన్ ఏమవుతుందో తెలుసా ?

ఒక్క హిట్ పడితే రేట్లు ఆకాశానికి.. ‘జైలర్ 2’ బేరసారాలపై ఇండస్ట్రీలో సెటైర్లు!

ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ రష్మి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

హైపర్ ఆది మార్కుల వెనుక ఉన్న అసలు కథ ఇదే!

2030 తర్వాతే పుష్ప 3.. అసలు కారణం ఇదేనా?

సమంతకు పుట్టబోయేది ఏ బిడ్డో తెలుసా..? ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..!

Big Stories

Advertisement
×