E-Paper
Advertisement

గణిత మేధావి రామానుజన్‌కు ప్రీతి ముకుందన్ ఏమవుతుందో తెలుసా ?

గణిత మేధావి రామానుజన్‌కు ప్రీతి ముకుందన్ ఏమవుతుందో తెలుసా ?
Advertisement

Preity Mukhundhan: ప్రీతి ముకుందన్,గణిత మేధావి శ్రీనివాస రామానుజన్..ఏంటి వీరిద్దరికి సంబంధం ఎంటని అనుకుంటున్నారా ..?యస్ వీరిద్దరికి .. సంబంధం కాదు కాదు దగ్గరి సంబంధమే ఉంది.అసలింతకీ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు రెడీ అవుతున్న ఈ అమ్మడికి,నంబర్స్ తో వండర్స్ క్రియేట్ చేసిన శ్రీనివాస రామానుజన్ కి ఆ దగ్గరి సంబంధం ఏంటో,రామానుజన్ కి ప్రీతి ముకుందన్ ఏమవుతుందో డీటైల్డ్ గా చూసేద్దాం.

శ్రీనివాస రామానుజన్ కి మునిమనవరాలు వరుస

Advertisement

2000 జూలై 30న తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న రామానుజన్ రోడ్ లో జన్మించిన ప్రీతి ముకుందన్, శ్రీనివాస రామానుజన్ కి మునిమనవరాలు వరుస(Great-grandniece) అవుతుందట.అవును ..ప్రీతి ముకుందన్ అమ్మ తరపు నుండి ఈ సంబంధం కలుస్తుందని సమాచారం.అంటే ప్రీతి ముకుందన్ కి శ్రీనివాస రామానుజన్ ముత్తాత అన్న మాట. గణితంలో ఎన్నో కొత్త కొత్త ఫార్ములాస్ కనుగొని ఎన్నో అధ్బుతాలకి ఆద్యుడు అయిన ఈ లెజెండ్ వారసులు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైన మెరిసిపోతూ సత్తా చాటడం విశేషం.

ప్రముఖ మ్యూజిషియన్ ‘గిటార్ ప్రసన్న’ కూడా

Advertisement

అంతే కాదండోయ్…’గిటార్’లో ప్రావీణ్యం సంపాదించి మంచి పేరు తెచ్చుకున్నప్రఖ్యాత మ్యూజిషియన్ ‘గిటార్ ప్రసన్న’ కూడా ఈమెకు మేనమామ అవుతారట.ఇక ప్రీతి ముకుందన్ విషయానికి వస్తే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచ్చి నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో బీటెక్ చదివింది.ఇక భరతనాట్యం లోనూ మంచి శిక్షణ పొందిన ప్రీతి మోడలింగ్ లోనూ సత్తా చాటింది.అలా పలు యాడ్స్ చేసిన ప్రీతీ చేసిన మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ‘ముత్తు ము2’తో యూట్యూబ్ లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం ఇక్కడ మరో విశేషం.అలా నటనపై ఇష్టంతో
‘మీనాయ్ బాయ్’ (Menu Boy), ‘మనీ బాయ్స్’ (Money Boys) వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.

also read :ఒక్క హిట్ పడితే రేట్లు ఆకాశానికి.. ‘జైలర్ 2’ బేరసారాలపై ఇండస్ట్రీలో సెటైర్లు!

ఇక ముఖ్యంగా తమిళనాట కవిన్ తో జోడీగా ప్రీతి నటించిన ‘స్టార్’ సినిమా 2024 మే నెలలో విడుదలై బాక్సాఫిస్ వద్ద మంచి టాక్ తో విమర్శకుల ప్రశంసలు పొందింది.ఇక 2024లో వచ్చిన ‘ఓం భీమ్ బుష్’ అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెల్సిందే .ఇక గతేడాది కన్నప్పతో అలరించిన ప్రీతీ ఈ మధ్యే బ్లాస్ట్ అనే సినిమాతో సత్తా చాటిన సంగతి తెల్సిందే.

ఇంకెలాంటి సంచలనాలు స్ప్రుష్టిస్తుందో !

శ్రీనివాస రామానుజన్ విషయానికి వస్తే 1887 డిసెంబర్ 22న ఈరోడ్, మద్రాసు ప్రెసెడెన్సీ,(ప్రస్తుతం తమిళనాడు)లో జన్మించిన రామానుజన్ ఏళ్ల క్రితమే చనిపోయినా ఆయన సమర్పించిన ‘రామానుజన్ ప్రైమ్’, ‘రామానుజన్ తీటా ఫంక్షన్’ వంటి సిద్ధాంతాలు నేటికీ ఆధునిక సైన్స్‌కు దిక్సూచిగా ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు.ఇక మసూచితో కేవలం 32 ఏళ్ల వయసులో అంటే 1920 ఏప్రిల్ 26 తమిళనాట కన్ను మూశారు రామానుజన్ .

చూడాలి మరి ఒకవైపు లెక్కల్లో జీనియస్, మరో వైపు మంచి సంగీత ప్రతిభ ఉన్న వంశం నుండి వచ్చిన ప్రీతి ముకుందన్ ముందు ముందు ఇంకెలాంటి సంచలనాలు స్ప్రుష్టిస్తుందో !

Related News

ఒక్క హిట్ పడితే రేట్లు ఆకాశానికి.. ‘జైలర్ 2’ బేరసారాలపై ఇండస్ట్రీలో సెటైర్లు!

ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ రష్మి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

హైపర్ ఆది మార్కుల వెనుక ఉన్న అసలు కథ ఇదే!

2030 తర్వాతే పుష్ప 3.. అసలు కారణం ఇదేనా?

సమంతకు పుట్టబోయేది ఏ బిడ్డో తెలుసా..? ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..!

నాగార్జున 100వ మూవీ నుండీ బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ , టైటిల్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

రూ.100 కోట్ల ఆస్తి.. ఊహించని స్టార్డం.. అయినా నోకియా ఫోన్ వాడుతున్న పోసాని.. అసలు కథేంటంటే?

Big Stories

Advertisement
×