E-Paper
Advertisement

పొంగులేటి టార్గెట్.. గులాబీ దళం వ్యూహం వెనుకున్న ప్లాన్ ఇదేనా?

పొంగులేటి టార్గెట్.. గులాబీ దళం వ్యూహం వెనుకున్న ప్లాన్ ఇదేనా?
Advertisement

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ క్యాబినెట్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆ మంత్రిని టార్గెట్ గా చేసుకొని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి, దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే ప్రధాన డిస్కషన్‌గా మారింది. అసలు గులాబీ పార్టీ పొంగులేటినే ఎందుకు కార్నర్ చేయాలని చూస్తోంది. కారు పార్టీ ఇంత సీరియస్‌గా ఆ మంత్రి ఇష్యూని తెరమీదకు తెస్తుండటం వెనుక ప్రత్యేక కారణేలేవైనా ఉన్నాయా?

కాంగ్రెస్ మంత్రులపై దూకుడు

గత శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం హోదాను సమర్ధంగా నిర్వర్తించడం లేదన్న విమర్శులు ఉన్నాయి. ప్రజాసమస్యలను గాలికి వదిలిపెట్టి, ఎంత సేపు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులపై, వారి కుటుంబీకులపై ఆధారాలు లేని ఆరోపణలతో లేనిపోని హడావుడి చేస్తోందన్న అపవాదు గులాబీ పార్టీ మూటగట్టుకుంటోంది. తమ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రోజుకో కొత్త డ్రామా షురూ చేస్తున్నారట. అందులో భాగంగానే ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ టార్గెట్ చేసుకుందంటున్నారు.

పొంగులేటిపై బీఆర్ఎస్ ఫోకస్

Advertisement

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధం లేని ఓ కేసులో పొంగులేటిని , ఆయన కుటుంబీకులను లాగాలని చూస్తోంది బీఆర్ఎస్. దానికి సంబంధించి భారీ పోరాటం చేసేందుకు సిద్ధమైందట గులాబీ పార్టీ. హౌస్ కమిటీ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఆ క్రమంలో మంత్రి పొంగిలేటిని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని, అక్రమంగా నడుస్తున్న ఆయనకు సంబంధించిన క్రషర్ యూనిట్ లను సీజ్ చేయాలని పట్టుబడుతోంది.

ఖమ్మంలో వేడెక్కుతున్న రాజకీయాలు

ఖమ్మం నగర శివార్లలో రాఘవ కన్స్‌ట్రక్షన్ యూనిట్లు నడుపుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది . ఎలాంటి అనుమతులు లేకుండా క్రషర్ యూనిట్లు నడుపుతోందని, దీనికి పర్యావరణ అనుమతులు లేవని, జీవో నంబర్ 111 పరిధిలో వచ్చే ప్రాంతాల్లో అక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నారని గులాబీ పార్టీ కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తోంది. ఇదే వ్యవహారంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి పార్టీ నేతలతో ఓ నిజనిర్ధారణ కమిటీని వేసింది. ఈ కమిటీ పలుమార్లు క్రషర్ ప్రాంతాన్ని సందర్శించి పార్టీ పెద్దలకు ఓ నివేదికను అందించింది.

మైనింగ్ అక్రమాలపై సీఎం క్లారిటీ

Advertisement

అసెంబ్లీలో సైతం మంత్రిని టార్గెట్ చేస్తూ .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు అరోపణలు గుప్పిస్తున్నారు. అయితే బిఆర్ఎస్ ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పి కొట్టారు. గత 12 ఏళ్లుగా జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడి విచారణకు ఆదేశించామని తెలిపారు. టీఆర్ఎస్ హయంలో జరిగిన మైనింగ్ అక్రామాలను కూడా బయటపెడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అటు రాఘవ కన్స్‌ట్రక్షన్స్ ప్రతినిధులు కూడా తమపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు.

పొంగులేటిని వదిలేదేలే.. బీఆర్ఎస్

పొంగులేటి అక్రమ క్వారీలు నడుపుతున్నారని, హైదరాబాదులో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. పొంగులేటి నీ వదిలేదేలే .. అన్న రేంజ్ లో టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ ఈ అంశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. మరోపక్క కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలతో ముడిపెట్టి కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేస్తుంది. అసలు ఇంతకీ బీఆర్ఎస్ ఎందుకు పొంగులేటిని టార్గెట్ చేసింది, అంటే దానికి బలమైన కారణాలే ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

19 స్కామ్‌ల ఆరోపణలు

రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వివిధ శాఖల్లో సుమారు 19 స్కాములు జరిగాయని ఆరోపిస్తున్న కారు పార్టీ వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆ స్కామ్ లకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా బిఆర్ఎస్ వద్ద లేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాని పొంగులేటి నేతృత్వంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతోందంట. పొంగులేటి మంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు వారికి మింగుడుపడటం లేదంట. అందుకే పొంగులేటిని ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుంటున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.

బీఆర్ఎస్‌పై పెరుగుతున్న ప్రశ్నలు

ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తమ పాత్రను సరైన విధంగా పోషించకుండా, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తు కాలం వెళ్లబుచ్చుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బిఆర్ఎస్ మాత్రం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నామని, అది వారికి రుచించడం లేదని వాదిస్తోంది. మరి గులాబీ పార్టీ అంత ధీమాగా ఆరోపణలు చేస్తున్నప్పుడు.. వాటికి సంబంధించిన ఆధారాలు బహిర్గతం చేస్తే.. అందరికీ తెలుస్తాయి కదా? అని సాధారణ జనం సైతం ప్రశ్నిస్తున్నారు. మరి గులాబీ టీమ్ ఎందుకు నాన్చుడు ధోరణి అవలంభిస్తుందో వారికే తెలియాలి.

Also Read:ఇరాన్ చేతికి అణు బాంబు.. ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×