E-Paper
Advertisement

Inzamam-ul-Haq: గుడ్డిగా బ్యాట్ ఊప‌డం త‌ప్ప‌, వైభ‌వ్ కు అస్స‌లు ఆడ‌రాదు

Inzamam-ul-Haq:  గుడ్డిగా బ్యాట్ ఊప‌డం త‌ప్ప‌, వైభ‌వ్ కు అస్స‌లు ఆడ‌రాదు
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 tournament) అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో త్వరలో జరిగే టి20 సిరీస్ ల కోసం కూడా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేసింది బీసీసీఐ. అయితే ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై (vaibhav Suryavanshi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq). ఇండియన్ మైదానాలలో తప్ప విదేశాల్లో వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆడలేడని బాంబు పేల్చారు. దీనికి ఉదాహరణ శ్రీలంక A జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా వైభవ్ వైఫల్యమే కారణం అంటూ వ్యాఖ్యానించారు. అనవసరంగా టీమిండియా ( Team India) జట్టులోకి వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేసిందని బీసీసీఐపై (BCCI) కూడా సెటైర్లు పేల్చారు. దీంతో వైభవ్ పై ఇంజమామ్ ఉల్ హ‌క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

గుడ్డిగా బ్యాట్ ఊప‌డం త‌ప్ప‌, వైభ‌వ్ కు అస్స‌లు ఆడ‌రాదు

Advertisement

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (vaibhav Suryavanshi ) అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో టీమిండియాలోకి ( Team India) అతగాడిని తీసుకున్నారు. ఈ క్రమంలో వైభవ్ పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, టీమిండియా A జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతోంది. ఇందులో వైభవ్ సూర్యవంశీ ఇరగదీస్తాడని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా 14 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు వైభవ్. దీంతో వైభవ్ ను టార్గెట్ చేసి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజెన్స్. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ కూడా ర్యాగింగ్ చేశారు. శ్రీలంకలో ఆడుతున్న వైభవ్, ఐపీఎల్ తరహాలో ఫీల్ అయి షాట్లు ఆడాడని.. అందుకే 14 పరుగులకే అవుట్ అయ్యాడు అంటూ హేళన చేశారు.

ఇండియన్ మైదానాలపై తప్ప విదేశీ గంటలపై వైభవ్ ఆడడం ఏమాత్రం జరగదు అంటూ బాంబు పేల్చారు. ఫ్లాట్ పిచ్ లు అయితేనే వైభవ్ అద్భుతంగా రాణిస్తాడని పేర్కొన్నారు. అలాగే గుడ్డిగా వైభవ్ బ్యాట్ ఊపుతాడు తప్ప.. అతనికి నిజంగా షాట్ ఆడరాదని ఇజ్జత్ తీశారు. ఐపీఎల్ లో తప్ప వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ కు పనికిరాడు అని పరువు తీశారు. ఇప్పటికైనా వైభవ్ సూర్యవంశీని మరిన్ని రోజులు సానపెట్టాలని… ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి తీసుకురాకూడదని కోరారు. బాగా రాటు దేలిన తర్వాత మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ కు పరిచయం చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి ( BCCI) సూచనలు చేశారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×