Trolls on Anchor Sravanthi Chokkarapu: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. రేపు ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే (Independence Day). ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సినీ, టీవీ సెలబ్రిటీష్ నుంచి సామాన్య ప్రజల వరకు దేశభక్తిని చాటుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు దేశభక్తిని చాటుతూ.. జాతీయ జెండాను రిప్రజెంట్ చేస్తూ శారీ డ్రెస్‌లతో ఫోటోషూట్స్ ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ యాంకర్ స్రవంతి చొక్కారపు (Anchor Sravanthi Chokkarapu) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా కలర్‌లో చీర కట్టి ఫోటో షూట్‌లో పాల్గొంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
స్రవంతి చొక్కారపుపై ట్రోల్స్
తన ఫోటో షూట్‌లో కాషాయం, వైట్ కలర్స్ ఉండేలా చీర కట్టడమే కాదు.. జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని కూడా ఆమె రిప్రెజెంట్ చేసింది. అయితే ఆమె ఫోటో షూట్‌పై నెటిజన్స్ నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఆమె ఫాలోవర్స్ సూపర్ అంటూ ప్రశంసిస్తుంటే.. మరికొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. అంతేకాదు జాతీయ పతకాన్ని ఆమె అవమానపరిచిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి జాతీయ జెండాలోని రంగులతో డ్రెస్ కోడ్ ఉండోచ్చు. కానీ, జాతీయ జెండానే దుస్తులుగా ధరించరాదు. అలా చేస్తే జాతీయ పతకాన్ని అవమాన పరిచినట్టే అవుతుంది. ఇప్పుడు స్రవంతి చొక్కారపు అదే చేసిందంటున్నారు నెటిజన్స్.
నువ్వేమైన యోధురాలివా?
పైగా తన చీరలో కాషాయం రంగు కాకుండ రెడ్ కలర్ ఉంది. అశోక చక్రం కూడా తన చీరపై ముద్రించి ఉంది. దీనిపై నెటిజన్స్, దేశపౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆమె చీర జాతీయ జెండాల లేకపోయినా.. చీరపై అశోక చక్రం కూడా ఉండటంతో త్రివర్ణ పతాకం రూపురేఖనే మార్చేసిందంటున్నారు. ఇది చూసి నువ్వు ఏమైనా.. దేశం కోసం పోరాటం చేసిన యోధురాలివా? లేక దేశంలోని ప్రముఖ వ్యక్తివా? జాతీయ జెండానే చీరలా ధరించావ్ అంటూ ఆమెపై గుర్రుమంటున్నారు.
Also Read: Mirai Hindi Rights: కరణ్ జోహార్ చేతికి మిరాయ్ హిందీ రైట్స్.. తేజ సజ్జా ఖాతాలో మరో భారీ హిట్
జెండాలోని కలర్ కూడా తెలియదా?
కాషాయం రంగు పెట్టాల్సింది.. ఎర్ర రంగు ధరించింది.. జెండాలోని కలర్ కూడా తెలియదా? అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైన తన ఫోటో షూట్‌తో స్రవంతి చొక్కారపు ట్రోల్స్ బారిన పడింది. ప్రస్తుతం ఆమెను నెటిజన్స్ దారుణంగా విమర్శిస్తున్నారు. కాగా స్రవంతి చొక్కారపు గురించి తెలిసిందే. సినిమా ఈవెంట్స్‌లో యాంకరింగ్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా తన ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తరచూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. గ్లామర్ షోకు లిమిట్స్ ఉండవు. ఘాటు అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. అలాంటి స్రవంతి.. దేశభక్తిని చాటుకుంటే చేసిన ఈ ఫోటోషూట్ కొందరిని ఆకట్టుకోగా.. మరికొందరిని మాత్రం ఆగ్రహానికి గురి చేస్తుంది.
Anchor Sravanthi Chokkarapu #SravanthiChokkarapu #Sravanthi #IndependenceDay2025 #IndependenceDay #Independence @urs_sravanthi pic.twitter.com/i7mmFilfWm
— BIG TV Cinema (@BigtvCinema) August 14, 2025