DMart Offer: డిమార్ట్ షాపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కుటుంబాలు నెలవారీగా షాపింగ్ చేస్తుంటారు. బయట షాపులతో పోల్చితే డిమార్ట్‌లో షాపింగ్ చేయడం వల్ల కొంత ఖర్చు తగ్గుతుంది. అందుకే డిమార్ట్ షాపింగ్ కస్టమర్లను ఆకర్షిస్తోంది. తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయి. అలాగే డిమార్ట్ స్పెషల్ ఆఫర్లను కూడా ప్రకటిస్తోంది. ముఖ్యంగా గృహ వస్తువులు, కిరాణా సామాను, ఇతర వస్తువులపై భారీ ఆఫర్లతో అమ్మకాలు జరుపుతోంది. డిమార్ట్‌లో కిరాణా, గృహోపకరణాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, తదితర వస్తువులపై డిస్కౌంట్లు లభించనున్నాయి. అయితే.. తాజాగా ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకుని డీమార్ట్ అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది.
ఆగస్టు 7 నుంచి 15 వరకు..
ఆగస్టు 7న మొదలైన ఈ ఆఫర్ సేల్.. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండనుంది. కిరాణా, గృహోపకరణాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, తదితరలాంటి వస్తువులపై 85 శాతం వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది. చాలా వస్తువులపై బై వన్ గెట్ వన్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
రూ.460 వస్తువు రూ.230కే..
ఎగ్జాంపుల్ చూసుకుంటే.. బ్రిటానియా జిమ్ జాబ్ కుకీస్ ధర రూ.120. కానీ డిమార్ట్ దీనిని రూ.60కే విక్రయిస్తోంది. బ్రిటానియా చీజ్ స్లైసెస్ 400 గ్రాముల ధర రూ.460 కాగా ఇప్పుడు రూ.230కే లభిస్తోంది. వీటితో పాటు టాయిలెట్ క్లీనర్లు, బిస్కెట్లు, తదితర వస్తువులు సగం ధరకే లభిస్తున్నాయి.
కాంబో ఆఫర్లు కూడా..?
డిమార్ట్ కాంబో ఆఫర్లను సైతం ప్రకటించింది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులను ఒకేసారి తీసుకుంటే ధరలో 20 శాతం వరకు ఆఫర్ ప్రకటించారు. సబ్బులు, కూల్ డ్రింక్స్ వస్తువులను కాంబో ఆఫర్ లో కొనుగోలు చేస్తే రూ.20 నుంచి రూ.30 తగ్గింపు పొందవచ్చును. పూజా సామాగ్రి అయిన అగర్బత్తీలు, దీపం నూనె, కొవ్వొత్తులు, కాంఫర్ వంటి వస్తువులపై 45 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.
టీషర్టులపై కూడా డిస్కౌంట్
దుస్తులపై కూడా డిమార్ట్ భారీ ఆఫర్ ను ప్రకటించింది. టీ-షర్టులు, స్కిన్ కేర్ క్రీమ్స్, షాంపూలు, డియోడరెంట్లు 40-50% డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. డైపర్లు, బేబీ సోప్, మసాజ్ ఆయిల్, బొమ్మలు లాంటి వస్తువులు రూ.53 నుంచి స్టార్ట్ అవ్వనున్నాయి.
వీటిపై 20 నుంచి 30 శాతం
ఇక కిరాణా సామాగ్రికి సంబంధించి పప్పులు, వంటనూనె, ఉప్పు, చక్కెర, రవ్వ, మినపప్పు, పెసర్లు, కందిపప్పు, బియ్యం, బిర్యానీ రైస్, స్నాక్స్ తదితర వస్తువులపై బయట షాపులతో పోలిస్తే డిమార్టులో చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఎలక్ట్రిక్ కెటిల్స్, జ్యూసర్లు, మిక్సర్ గ్రైండర్లు, ఇండక్షన్ కుక్ టాప్, డిన్నర్ సెట్లపై 20 శాతం నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్లతో అమ్మకాలు జరగుతున్నాయి.
షాపింగ్ చిట్కాలు
శుక్రవారం నుంచి ఆదివారం వరకు వీకెండ్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. రద్దీ తక్కువగా ఉండే మంగళ, బుధ, గురువారాల్లో కొత్త స్టాక్ అందుబాటులో ఉంటుంది. వస్తువుల నాణ్యత, ఎక్స్‌పైరీ డేట్ తప్పనిసరిగా చెక్ చేయండి. సొంత షాపింగ్ బ్యాగ్ తీసుకెళ్లడం ద్వారా రూ.10-30 అదనపు ఖర్చు ఆదా చేయవచ్చు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ సేల్‌తో డీమార్ట్ తన కస్టమర్లకు అత్యంత విలువైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది.
ALSO READ: BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు