SIIMA 2025 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలలో అల్లు అరవింద్ ఒకరు. గీత ఆర్ట్స్ బ్యానర్ పైన అల్లు అరవింద్ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పాలి. మగధీర లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సినిమాను చేసిన ఘనత కూడా ఈ బ్యానర్ కి ఉంది. ఆ టైంలో ఒక కథను నమ్మి అన్ని డబ్బులు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ రిస్క్ చేసి అద్భుతమైన రికార్డు సొంతం చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం కూడా గీత ఆర్ట్స్ సినిమాలు చేయడమే కాకుండా, గీత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా అద్భుతమైన సినిమాలను తెలుగులో కూడా అందిస్తున్నారు. రీసెంట్ గా మహవతార్ నరసింహ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసి తెలుగులో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏడు విభాగాలలో నేషనల్ అవార్డ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి సైమా ప్రెస్ మీట్ కీలక వ్యాఖ్యలు చేశారు అల్లు అరవింద్.
అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
తెలుగులో కల్చర్ కొద్దిగా తక్కువైంది. ఏడు అవార్డులు మనకు తెలుగులో వచ్చాయి. ఏడు అవార్డులకి ఇండస్ట్రీస్ స్పందించక ముందే, సైమా వారు స్పందించి వారందరినీ ఒక స్టేజి మీదకి తీసుకువచ్చి, వాళ్లను సత్కరించాలి అనుకోవడం నిజంగా అప్రిషియేట్ చేయదగ్గది. నేను హృదయపూర్వకంగా విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నాను. చాలామంది గ్రేట్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు. అలానే నవ్వుతూ మన బేబీ డైరెక్టర్ గురించి వెతుకుతున్నాను. మనకు 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దీనిని మనం ఒక పండగగా జరుపుకోవాలి. కానీ ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా ఎవరి కుంపటి వాళ్లదే.
మాటలు వెనుక ఆంతర్యం ఏమిటి
ఎవరి కుంపటి వాళ్లదే. మామూలుగా ఇండస్ట్రీలో ఐకమత్యంగా ఉండాలి అని చెబుతూ ఉంటారు. ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉండడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇంకా గొప్ప గుర్తింపు సాధిస్తుంది అని నమ్ముతుంటారు. అయితే ఇప్పుడు ఏ కోణంలో ఎవరి కుంపటి వాళ్లది అని అల్లు అరవింద్ అన్నారు ఎవరికీ అర్థం కావడం లేదు. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పీపుల్ తో అల్లు అరవింద్ కు ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా అనే ఆలోచనలు కు కూడా ఈ స్టేట్మెంట్ దారితీస్తుంది. మరోవైపు అల్లు అరవింద్ కి బాగా సన్నిహితుడు అయిన బన్నీ వాసు కూడా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అట్లీ సినిమా పనుల్లో ముంబైలో బిజీగా మారిపోయాడు.
Also Read : War 2 – Coolie : వీకెస్ట్ ఆఫ్ ది వీకెస్ట్… దీంట్లో కూడా వీటి మధ్య వార్