Nagarjuna Coolie: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాగార్జునకి ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ స్టార్ హీరోస్ లో నాగార్జున ఒకరు. నాగార్జున కెరియర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి. శివ వంటి సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పైన విపరీతమైన ప్రభావాన్ని చూపింది. అలానే అన్ని రకాల పాత్రలు తన కెరియర్ లో చేశారు నాగార్జున. అయితే ఇప్పటివరకు విలన్ పాత్రలో నటించలేదు.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలి సినిమాలో సైమన్ అనే పాత్రలో కనిపించాడు నాగార్జున. ఇది ఒక నెగిటివ్ రోల్. కానీ ఈ సినిమా విడుదలకు ముందు నుంచే నాగార్జున విలన్ పాత్రలో కనిపిస్తున్నారు అని విపరీతంగా ప్రమోట్ చేశారు. దీంతో మొదటిసారి నాగార్జున ఎలా కనిపించబోతున్నారో అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూశారు. అయితే పేరుకు మాత్రమే విలన్ పాత్రను నాగార్జునకు పరిమితం చేశారు.
ఏడుసార్లు కథను విన్నారు
సినిమాలో విలన్ ని చూసిన వెంటనే మనకు అతనిపై కోపం రావాలి. కానీ నాగర్జునని చూస్తే ఎక్కడ కోపం రాదు. మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా అదిరిపోయాడు. అలానే విక్రంలో కూడా ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ కూలీ సినిమాలో ఆ ఇంపాక్ట్ మిస్ అయింది. నాగార్జున పాత్రలో కొద్దిపాటి పాజిటివ్ వైబ్ ఉండటం వలన విలన్ అని ఎవరు పెద్దగా ఫిక్స్ అవ్వలేకపోయారు. ఈ కథను ఏడుసార్లు విన్న తర్వాత నాగార్జున ఓకే చేశారు. అంటే పాత్రలో ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి..
పాత్రలో మైనస్ లు ఇవే
8 సంవత్సరాల నుంచి తన దగ్గరే ఒక వ్యక్తి పని చేస్తూ ఉంటాడు. అతను చాలామందిని కంట్రోల్ చేస్తాడు. కానీ తనను నాగార్జున కనిపెట్టలేడు. అదే వాడు నాగార్జున కొడుకును చంపేస్తుంటే కాపాడుకోలేడు. అలానే తనకంటే 30 ఇయర్స్ ఏజ్ ఎక్కువ ఉన్న వ్యక్తితో ఫైట్ చేయలేడు. సిగరెట్ కాల్చడం, తాగడం తప్ప నాగర్జున క్యారెక్టర్ లో ఇంకేమీ ఉండదు. ఇదే ఈ క్యారెక్టర్ కు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. కథలో ఈ పాత్రను ఏ నటుడుతో అయినా చేయించవచ్చు. కానీ ఈ పాత్ర కోసం నాగార్జునను ఎందుకు తీసుకొచ్చారు అర్థం కాదు. అలానే నాగర్జున ఎలా ఒప్పుకున్నాడు అసలు అర్థం కాదు. ఎంతో ఆశతో వెళ్లిన నాగార్జున ఫ్యాన్స్ కి మాత్రం తీవ్రమైన నిరాశను కలిగించే పాత్ర ఇది. ఏదేమైనా లోకేష్ కనగరాజ్ అన్నిసార్లు అడగడం వలన మొహమాటంతో కింగ్ చేశారేమో.
Also Read: SIIMA 2025 : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు, వాళ్లతో విభేదాలు?