OTT Movie : సైకాలాజికల్ సర్వైవల్ హారర్ స్టైల్‌లో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఉంటుంది. ఇది ఐదుగురు అపరిచితులను ఆహారం లేకుండా బంధించి, ఎలా బతుకుతారనే ఒక సైకో సైంటిస్ట్ చేసే ప్రయోగాన్ని చూపిస్తుంది. ఈ సినిమాలో ఆకలి, భయం, ఒకరినొకరు చంపుకోవడం, మాంసం తినడం వంటి భయంకర సన్నివేశాలు ఉంటాయి. గుండె గగుర్పొడిచే ఇలాంటి సినిమాని చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి. ఈ సినిమా పేరు ? స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఏ ఓటీటీలో ఉందంటే
హంగర్’ (Hunger) స్టీవెన్ హెంట్‌జెస్ డైరెక్ట్ చేసిన ఒక అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే లలో అందుబాటులో ఉంది. ఇందులో లోరీ హ్యూరింగ్ (జోర్డాన్) ప్రధాన పాత్రలో నటించింది. ఆమె సర్వైవర్‌గా బలమైన నటన చూపించింది. లిండెన్ ఆష్బీ (గ్రాంట్) ఆరోగ్య సమస్యలతో బాధపడే పాత్రలో, జో ఇజెండర్ (లూక్) స్వార్థపరుడైన కిల్లర్‌గా, లియా కోల్ (అన్నా) భయపడే యువతిగా, జూలియన్ రోజాస్ (అలెక్స్) మానసికంగా సమస్య ఉన్న వ్యక్తిగా నటించారు. బ్జోర్న్ స్ట్రాస్ సైకో సైంటిస్ట్‌గా కనిపిస్తాడు. IMDb లో ఈ సినిమాకి 5.2/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళ్తే
జోర్డాన్, గ్రాంట్, లూక్, అన్నా, అలెక్స్ అనే ఐదుగురు అపరిచితులను ఒక చీకటి బావిలో బంధిస్తారు. అక్కడ నీళ్లు, టాయిలెట్ పేపర్, ఒక గడియారం తప్ప ఆహారం ఏమీ ఉండదు. రెండో రోజు ఒక సర్జికల్ కత్తి కనిపిస్తుంది. దానితో “మనిషి శరీరం 30 రోజులు ఆహారం లేకుండా బతకగలదు” అని నోట్ రాసి ఉంటుంది. వీళ్ళను ఒక సైకో సైంటిస్ట్ కెమెరాలతో గమనిస్తూ, వాళ్ళు ఆకలితో ఏం చేస్తారో పరీక్షిస్తుంటాడు. ఈ సైంటిస్ట్‌కు ఒక డార్క్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఒక ప్రమాదంలో తన తల్లి మాంసాన్ని తిని బతికాడు. అదే అతన్ని ఈ పాశవిక ప్రయోగానికి గురి చేసింది. రోజులు గడిచేకొద్దీ ఆకలి పెరిగి గ్రాంట్ బలహీనపడతాడు. మిగిలిన వాళ్ళు అతన్ని చంపి తినడానికి ప్లాన్ చేస్తారు.
Read Also : ఇంత కరువులో ఉన్నారేంది సామీ… మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు