BigTV English

OTT Movie : ఫామ్ హౌజ్ లో పార్టీ… అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రారు… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

OTT Movie : ఫామ్ హౌజ్ లో పార్టీ… అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రారు… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు స్పైన్ చిల్లింగ్ థ్రిల్ ను ఇస్తాయి. ఈ సినిమాలు క్షణక్షణం ఉత్కంఠంగా నడుస్తుంటాయి. అందులోనూ హాలీవుడ్ సినిమాలలో హింస కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో ఒక యువకుడు స్నేహితులతో ఫామ్‌హౌస్‌కి వెళ్తే, పిచ్‌ఫోర్క్‌తో ఒక సైకో కిల్లర్ వాళ్లను ఒక్కొక్కరినీ గుండె గగుర్పొడిచే విధంగా చంపుతుంటాడు. ఈ సినిమా భయం, రక్తం, కొన్ని ఫన్నీ మూమెంట్స్‌తో టెన్షన్ పుట్టిస్తుంది. ఈ హారర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


ఏ ఓటీటీలో ఉందంటే

‘పిచ్‌ఫోర్క్’ (Pitchfork) గ్లెన్ డగ్లస్ ప్యాకర్డ్ డైరెక్ట్ చేసిన ఒక భయంకరమైన హారర్ సినిమా. ఇందులో డానియల్ విల్కిన్సన్ (పిచ్‌ఫోర్క్) ఒక డేంజరస్ కిల్లర్‌గా, బ్రియాన్ రాట్జ్ (హంటర్), లిండ్సే నికోల్ (క్లేర్) నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 2016లో హాట్ స్ప్రింగ్స్ హారర్ ఫెస్టివల్‌లో మొదట రిలీజ్ అయింది. ఇప్పుడు Amazon Prime Video, Tubiలో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు, హిందీ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది. ఇది హాట్ స్ప్రింగ్స్ హారర్ ఫెస్టివల్‌లో “బెస్ట్ ఫస్ట్ టైమ్ ఫిల్మ్‌మేకర్”, లాస్ ఏంజిల్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో “బెస్ట్ సినిమాటోగ్రఫీ” గెలిచింది.


స్టోరీలోకి వెళితే

హంటర్ కిలియన్ అనే యువకుడు తాను స్వలింగ సంపర్కుడని తన తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను న్యూయార్క్ నగరం నుండి తన స్నేహితులతో కలిసి మిచిగాన్‌లోని, తన కుటుంబ ఫార్మ్ హౌస్ కి తిరిగి వస్తాడు. వీళ్లంతా అక్కడ ఒక బార్న్ డాన్స్‌తో సంబరం చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. కానీ పిచ్‌ఫోర్క్ అనే సైకో వ్యక్తి, జంతు చర్మం మాస్క్ ధరించి, చేతికి పిచ్‌ఫోర్క్ ఆయుధంగా ఉపయోగించి, వారిని ఒక్కొక్కరినీ దారుణంగా చంపడం ప్రారంభిస్తాడు. సినిమా మొదట్లో ట్రిషా అనే అమ్మాయిని పిచ్‌ఫోర్క్ దారుణంగా చంపే సన్నివేశంతో ప్రారంభమవుతుంది.

Read Also : టీనేజ్ కుర్రాడికి ఇద్దరమ్మాయిల ఓపెన్ ఆఫర్… అందంగా ఉన్నారని సొల్లు కారిస్తే మైండ్ బెండయ్యే ట్విస్ట్

హంటర్ తన స్నేహితులు—మాట్, క్లేర్, గోర్డాన్, ఫ్లో, లెనాక్స్, జానెల్, రాకీ—తో కలిసి ఫార్మ్ హౌస్ లో సరదాగా గడుపుతున్నాప్పుడు, వీళ్లంతా ఈ భయానక పరిస్థితిలో చిక్కుకుంటారు. ఈ హత్యలు చేస్తున్న పిచ్‌ఫోర్క్ బెన్ హోలిస్టర్ అని తెలుస్తుంది. అతను పొరుగున ఉండే మానసిక రుగ్మత గల కుటుంబంలోని కొడుకు. అతన్ని వాళ్ళ పేరెంట్స్ బేస్‌మెంట్‌లో బంధించి ఉంటారు. ఇక క్లైమాక్స్‌లో, హంటర్, క్లేర్‌ను బెన్ తల్లిదండ్రులు బంధిస్తారు. కానీ జెన్నీ వచ్చి బెన్ తండ్రిని కాల్చి, వారిని రక్షిస్తుంది. ఈ సమయంలో పిచ్‌ఫోర్క్ తన తల్లిని కూడా చంపేస్తాడు. చివరగా, హంటర్, క్లేర్, జెన్నీలు తప్పించుకుంటారు. జెన్నీ పిచ్‌ఫోర్క్‌ను జంతువులా నియంత్రించి, చెట్టుకు గొలుసుతో బంధిస్తుంది. అయితే క్లైమాక్స్ ఊహించని టర్న్ తీసుకుంటుంది. ఆ సైకోని వీళ్ళు అంతం చేస్తారా ? మిగిలిన వాళ్ళు కూడా ఆ సైకో చేతిలో బలవుతారా ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : ప్రైవేట్ ఐలాండ్ లో అరాచకం… అమ్మాయిలకే తెలియకుండా ఆ పని… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : ఐదుగురు మనుషులతో 30 రోజులు అదే పని… బ్లడీ డెత్ గేమ్… థ్రిల్లింగ్ మలుపులు, ఊహించని సర్ప్రైజులు

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీసే టార్గెట్… బుర్ర బద్దలయ్యే ట్విస్టులున్న మిస్టీరియస్ బాక్స్… క్లైమాక్స్ హైలెట్

Coolie OTT: రజినీకాంత్ కూలీ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

OTT Movie : ఇదెక్కడి సినిమారా బాబూ… మొక్కలకు ప్రాణం వచ్చి మనుషుల్ని లేపేస్తే… సై -ఫై మాస్టర్ పీస్ థ్రిల్లర్

Big Stories

×