Soundarya Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫిలిం ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆగస్టు నెలలో సూపర్ స్టార్ రజినీకాంత్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అదే ఆగస్టు నెలలో తాను నటించిన కూలీ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన 50 ఇయర్స్ టైటిల్ కార్డు డిజైన్ చేశారు.
కూలీ సినిమా మొదలవ్వడానికంటే ముందు ఈ టైటిల్ కార్డు వేయడం అనేది ఆడియన్స్ కి మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే రజినీకాంత్ అభిమానులు ఇష్టపడే రేంజ్ లో ఎలివేషన్ లేకపోయినా కూడా, రజనీకాంత్ ని చూపించిన విధానం మాత్రం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. బుకింగ్స్ తోనే ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సౌందర్య రజనీకాంత్ రివ్యూ
ఇక తాజాగా రజనీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ ఈ సినిమాను చూశారు. ఈ సినిమాను చూసి తన ఒపీనియన్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 50 ఇయర్స్, నాన్న మీరు కేవలం సినిమాలో ఒక పార్ట్ కాదు, సినిమాను ఎలివేట్ చేశారు, సినిమాను రీడిఫైండ్ చేశారు, సినిమాని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు. మీరు చాలామందికి, జనరేషన్ కు ఒక ఇన్స్పిరేషన్. మీరు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఒక హృదయ స్పందన. అంటూ తెలిపారు.
మీ కూతురుగా నేను గర్వపడుతున్నాను. నేను మీకు చెప్పే దానికంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కూలీ సినిమా విషయానికి వస్తే లాస్ట్ పది నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ కోసం ఈ సినిమాను నేను మళ్లీ మళ్లీ చూస్తాను. వన్ అండ్ ఓన్లీ తలైవార్ మీరు అంటూ ట్వీట్ చేశారు.
50 years, Appa. You haven’t just been part of cinema … you’ve shaped it, redefined it, elevated it, and carried it into places it had never been before. You’ve inspired generations, set benchmarks, and become the heartbeat of the industry.
I’m a proud daughter, and I love you… pic.twitter.com/46dVsk79mG
— soundarya rajnikanth (@soundaryaarajni) August 14, 2025
భారీ స్పందన
ఈ సినిమాకు విపరీతమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా రజనీకాంత్ (Rajinikanth) తో పాటు చాలా మంది ఈ సినిమాలో నటించిన సినిమా మీద హైప్ విపరీతంగా క్రియేట్ అయింది. అయితే ఆ అంచనాలు అన్నిటిని ఒక స్థాయి మేరకు బాగానే అందుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాకి ఊహించిన స్థాయిలో టాక్ రాకపోయినా కూడా, నెగిటివ్ టాక్ అయితే రాలేదు. ఈ సినిమాని అనిరుద్ రవిచంద్రన్ ఎలివేట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సినిమా రిలీజ్ కి ముందు పాటలతోనే మంచి హైప్ క్రియేట్ చేశాడు అనిరుద్.
Also Read: Nagarjuna Coolie: కథను 7 సార్లు విన్నాక నాగార్జున ఎలా ఓకే చేశాడు అనేదే బిగ్గెస్ట్ మిస్టరీ