Love Marriage: ప్రేమ పెళ్లిల్లు ఎక్కువగా ఎవరు చేసుకుంటారో తెలుసా..? లవ్‌లో సక్సెస్ అయ్యే జాతకులు ఎవరో తెలసా..? ప్రేమించిన వారిని ఒప్పించడమే కాదు ఆ ప్రేమకు పెళ్లి భాజాలు మోగించేది ఎవరో తెలుసా..? ఇలాంటి విషయాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల్లో పుట్టిన వారికే ప్రేమలే సక్సెస్ అవుతాయట. ఆ ప్రేమలే పెళ్లి పీటల దాకా వెళ్తాయట. పెళ్లి పీటల దాకా వెళ్లిన ఆ ప్రేమలే విజయవంతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారట. మనసుకు నచ్చిన వారిని మెప్పించి.. ఒప్పించి ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లే లవ్ సక్సెస్ రేషియో ఎక్కువగా ఉన్న రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: పన్నెండు రాశుల్లో మొదటిదైన మేష రాశిలో పుట్టిన వ్యక్తులు స్వతహాగా స్వతంత్ర భావాలు కలిగిన వారు. ఈ రాశి జాతకులు ఎక్కువగా ప్రేమలో పడుతుంటారట. ప్రేమలో పడటమే కాదు.. తాము ప్రేమించిన వ్యక్తుల మనసు దోచేస్తారట. దోచేయటమే కాదు తమ ప్రేమను పెళ్లిపీటల దాకా తీసుకెళ్లడంలోనూ మేష రాశి జాతకులు సక్సెస్ అవుతారట. ఈ రాశిలో పుట్టిన వారే ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటుంటారట.
మిథున రాశి: ఈ రాశిలో పుట్టిన వారు తమ మనసులోని ఆలోచనలను ఎదుటి వారికి సులభంగా వ్యక్తం చేస్తారట. అలాగే తాము ఎవరినైనా ప్రేమిస్తే నిర్మోహమాటంగా.. సిగ్గుపడకుండా కాలయాపన చేయకుండా మదిలోని బావాలు వ్యక్త పరుస్తారట. తమకు ఇష్టమైన వారితో కలిసి ఉండడానికి ఇష్టపడుతుంటారు. అందువల్లే ఈ రాశి జాతకులు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటారట.
కర్కాటక రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు తమ ప్రియురాలు లేదా ప్రియుని బాగా ప్రేమించే స్వభావం కలిగిన ఉంటారట. అయితే ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎక్కువగా తమ స్నేహితులనే లవ్ మ్యారేజ్ చేసుకుంటారట.
తులా రాశి: ఈ రాశి జాతకులు ప్రేమతో కూడిన సంబంధాలను చక్కగా అస్వాదిస్తారు. వీళ్లు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడతారు. సో ఈ రాశి వాళ్లు కూడా ప్రేమ వివాహాలు చేసుకునే జాబితాలో ఉంటారట.
వృశ్చిక రాశి: ఈ రాశి జాతకులకు విలువలతో కూడిన బంధాల పట్ల చాలా గౌరవం ఉంటుంది. వీరు తాము ప్రేమించిన వారి పట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తారు. వీరు కూడా ప్రేమ వివాహానికి సుముఖంగా ఉంటారు.
ధనస్సు రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ప్రేమ, స్వేచ్చకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్లు ప్రేమ విషయంలో అస్సలు వెనకాడరు. కాబట్టి వీరు కూడా ప్రేమ వివాహం చేసుకుంటారు.
కుంభ రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు కూడా స్వేచ్చ స్వతంత్రమైన సంబంధాలను ఎక్కువగా ఇష్టపడతారు. ప్రేమ వివాహం చేసుకోవడం వీరి సహజ లక్షణం.
మీన రాశి: ఈ రాశి జాతకులు కూడా ప్రేమ అనుబంధాలు ఎక్కువగా ఇష్టపడతారు. వాటిని పోగొట్టుకునే ఆలోచన కూడా చేయరు. ఈ రాశి జాతకులు ప్రేమ వివాహం చేసుకోవడానికే ఇష్టపడతారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఆ 4 యోగాలు ఉన్న స్త్రీలకే ధనవంతులైన భర్తలు లభిస్తారట