War 2 – Coolie : తెలుగు ప్రేక్షకులు సినిమాల కోసం ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద సినిమా వస్తే చాలు థియేటర్ దగ్గర పండగ రకమైన వాతావరణం నెలకొంటుంది. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు అప్పుడప్పుడు రావడం వలన థియేటర్కు వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. అయితే మళ్లీ చాలా రోజుల తర్వాత థియేటర్లో కళకళలాడాయి. దీనికి కారణం రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలీ సినిమా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా. ఈ రెండు సినిమాలు మంచి అంచనాలతో బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. ఇక ప్రస్తుతం రెండింటి ఫలితాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఏ ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు.
ఫెయిల్యూర్ ట్రాక్
వార్ 2 సినిమాను నిర్మించింది ప్రముఖ ఎస్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ. అయితే ఈ బ్యానర్ లో వచ్చిన రెండు స్పై యూనివర్స్ సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన టైగర్ 3 సినిమా సరిగ్గా ఆకట్టుకోలేదు. ఇప్పుడు వార్తలు కూడా వార్ 2 పరిస్థితి కూడా దాదాపుగా అలానే ఉంది. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చిన లియో సినిమా ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈరోజు రిలీజ్ అయిన కూలీ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తుంది. మొత్తానికి ఇలా చూసినా కూడా వీరిద్దరి మధ్య పోటీ ఉంది అని చెప్పాలి.
మళ్లీ ఓజి తో పూర్వ వైభవం
ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రెండు పెద్ద సినిమాలు కూడా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చేసాయి. ఇక ముందు ముందు పెద్ద సినిమాలు దగ్గర్లో ఏమీ లేవు. మళ్లీ సెప్టెంబర్ 25న సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ఓజి (OG Movie) సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఓజి సినిమా మీద అంచనాలు పెట్టుకోకుండా చూడటం మంచిది. అలానే అదే డేట్ కు బోయపాటి శ్రీను (boyapati Srinu) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 (Akhanda) సినిమా కూడా విడుదల కానుంది. అయితే ఇది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: Coolie : అమీర్ ఖాన్ రోలెక్స్ ఏం కాదు… పక్కా కమెడియన్