OTT Movie : ఓటీటీలో సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలను ఈ సంస్థలు పోటీ పడి కొంటున్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా స్టోరీ కూడా అదిరిపోతోంది. సాధారణ స్టోరీగా మొదలై, ఇది ఒక రివేంజ్ థ్రిల్లర్ గా మారుతుంది. ఈ సినిమా ఒక బిలియనీర్ తన ప్రైవేట్ ఐలాండ్‌కు ఆహ్వానించిన కొందరు అతిథుల చుట్టూ తిరిగే ఒక మిస్టరీ థ్రిల్లర్. ఈ ఐలాండ్ లో డార్క్ సీక్రెట్స్ చాలా భయంకరంగా ఉంటాయి. అమ్మాయిలను ట్రాప్ చేసి ఘోరంగా హింసిస్తుంటారు. ఈ స్టోరీ ఒక స్పైన్ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘బ్లింక్ ట్వైస్’ (Blink Twice) జోయి క్రావిట్జ్ దర్శకత్వం వహించిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియో, MGM ప్లస్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇందులో నయోమి అకీ, చానింగ్ టాటమ్స్లే, అడ్రియా అర్జోనా, అలియా షాకత్, క్రిస్టియన్ స్లేటర్, సైమన్ రెక్స్ ,హేలీ ప్రధానపాత్రల్లో నటించారు. 2024 లో వచ్చిన ఈ సినిమాకి IMDbలో 6.5/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళ్తే
ఫ్రిడా ఒక యానిమల్ కాక్‌టెయిల్ వెయిట్రెస్. తన స్నేహితురాలు జెస్ తో కలిసి ఒక హై-ప్రొఫైల్ గాలాలో పనిచేస్తుంది. అక్కడ ఆమె టెక్ బిలియనీర్ స్లేటర్ కింగ్ ను కలుస్తుంది. అతను గతంలో CEOగా రాజీనామా చేసిఉంటాడు. స్లేటర్ ఫ్రిడా, జెస్‌ను తన ప్రైవేట్ ఐలాండ్‌కు వెకేషన్‌కు ఆహ్వానిస్తాడు. అక్కడ స్లేటర్ అసిస్టెంట్ స్టేసీ వాళ్ళ ఫోన్‌లను తీసుకుంటుంది. ఈ ఐలాండ్‌లో స్లేటర్ స్నేహితులు, ఇతర మహిళా అతిథులు ఉంటారు. వీళ్ళందరూ లగ్జరీ రూమ్స్, ఖరీదైన పెర్ఫ్యూమ్ గిఫ్ట్ బ్యాగ్స్, డ్రగ్స్, హై-ఎండ్ మీల్స్‌తో ఆనందిస్తారు. కానీ జెస్ మెమరీ లాప్సెస్‌ను గమనిస్తుంది. ఆమె ఐలాండ్‌లో ఏదో తప్పు జరుగుతోందని ఫ్రిడాకు చెబుతుంది. కానీ ఫ్రిడా ఆమె మాటలను పెద్దగా పట్టించుకోదు. ఒక రోజు జెస్ ఉన్నట్టుండి అదృశ్యమవుతుంది. మిగిలిన వాళ్ళకు ఆమె ఎవరో గుర్తు కూడా ఉండదు.
Read Also : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్
ఫ్రిడా ఒక కాటేజ్‌లో గిఫ్ట్ బ్యాగ్స్‌ను కనిపెడుతుంది. ఒక మెయిడ్ ఆమెకు పాము విషాన్ని తాగమని చెబుతుంది. అది ఆమె మెమరీలను తిరిగి తెస్తుంది. ఫ్రిడా ఈ విషం ద్వారా ఒక విషయం తెలుసుకుంటుంది. ఈ ఐలాండ్‌లోని పెర్ఫ్యూమ్ ఒక పుష్పం నుండి వస్తుంది. అది బ్రెయిన్ లోని మెమరీలను తుడిచివేస్తుంది. ఇక్కడ పురుషులు రాత్రిపూట మహిళలపై అఘాయిత్యాలు చేస్తుంటారు. ఆతరువాత ఈ పెర్ఫ్యూమ్ ను వాడి వాళ్ళ మెమోరీలను పోగొడుతుంటారు. ఈ క్రమంలోనే జెస్‌ను ఆ గ్యాంగ్ చంపేస్తుంది. ఎందుకంటే ఆమె మెమరీలను వీళ్ళు తుడిచివేయలేకపోయారు. ఫ్రిడా ఇతర మహిళలకు ఈ విషాన్ని తాగించి, వాళ్ళ మెమరీలను తిరిగి తెప్పిస్తుంది. ఒక రక్తపాత పోరాటంలో మహిళలంతా పురుషులను చంపేస్తారు. ఫ్రిడా స్లేటర్‌ను బతికించి, అతని వేప్‌లో పెర్ఫ్యూమ్ కలిపి, అతన్ని నియంత్రిస్తూ అతని కంపెనీకి CEOగా మారుతుంది. అతనిపై ఇలా రివేంజ్ తీర్చుకుంటుంది.