S J Suryah: నటుడు ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతడు విలన్ గా, డైరెక్టర్ గా, నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బెస్ట్ విలన్ గా ఎస్ జె సూర్య ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. తెలుగు, తమిళ్ లో అనేక సినిమాలలో నటించాడు. ప్రస్తుతం ఎస్ జె సూర్య వరుస సినిమా షూటింగ్లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఇతను ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఎస్ జె సూర్య తనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్ జె సూర్యతో పాటు మరికొంతమంది చిత్ర బృంద సభ్యులు హాజరయ్యారు.
Also Read: Ramiz Raja: బాల్ లో చిప్ పెట్టారు.. వెస్టిండీస్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు.. అంతా తొండాట అంటూ !
ఆ సమయంలో ఎస్ జె సూర్య సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ నటరాజన్ గురించి మాట్లాడారు. ఎస్ జె సూర్య ఓ సమయంలో హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ కి వెళ్ళారట. అదే సమయంలో అక్కడికి నటరాజన్ కూడా వచ్చారట. అక్కడ ఎస్ జె సూర్యను చూసిన తర్వాత నటరాజన్ అతని వద్దకు వెళ్లి సెల్ఫీ కావాలని కోరడంతో వెంటనే ఎస్జె సూర్య అతను ఎవరో తెలియక సెల్ఫీ ఇచ్చారట. అనంతరం ఎస్ జె సూర్య డ్రైవర్ కూడా నటరాజన్ తో సెల్ఫీ దిగుతానని చెప్పారట. దీంతో సూర్య తనతో సెల్ఫీ అడుగుతున్నాడని అనుకొని నాతో నువ్వు ఎప్పుడైనా సెల్ఫీ దిగవచ్చు కదా అని చెప్పారట. దీంతో డ్రైవర్ మీతో కాదు నటరాజన్ తో సెల్ఫీ దిగుతాను అని చెప్పారట. అతను క్రికెటర్ అని ఎస్ జె సూర్య డ్రైవర్ గుర్తించి తనకి చెప్పారట.
Also Read: Tim David – Brevis: ఇద్దరు విషయంలో అంబానీ తప్పుడు నిర్ణయం.. అతలాకుతలంలో ముంబై ఇండియన్స్
అతడు సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడని చెప్పడంతో ఎస్జే సూర్యకు అతను క్రికెటర్ అని తెలిసిందట. ఈ విషయాన్ని ఎస్ జె సూర్య ఆ కార్యక్రమంలో పంచుకున్నారు. ఈ విషయాన్ని సూర్య చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ప్రస్తుతం సూర్య షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎస్ జె సూర్య టాలీవుడ్ నటుడు మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాతో బెస్ట్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటినుంచి తెలుగులో వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. గేమ్ చేంజర్, సరిపోదా శనివారం లాంటి అనేక సినిమాలలో విలన్ గా నటించారు. ఎస్ జె సూర్య నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఎస్ జె సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
?igsh=bmF1cXZybWYza3Y2