Mirai in Hindi Rights: చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన తేజ సజ్జా ఏకంగా సూపర్ హీరో అయిపోయాడు. హనుమాన్ చిత్రంతో హీరోగా మారి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దాదాపు 11 భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ విశేష ఆదరణ అందుకుంది. ఈ దెబ్బతో తేజ నేషనల్ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒక్క దెబ్బతో తేజ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. హనుమాన్ బ్లాక్ బస్టర్ అతడి చిత్రాలపై మంచి హైప్ పెరిగింది. ప్రస్తుతం తేజ మీరాయ్ చిత్రంలో నటిస్తున్నాడు.
మరోసారి సూపర్ హీరోగా..
ఇది కూడా సూపర్ హీరో జానరల్లో వస్తుంది. ఈగల్ ఫేం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను హిందీలో ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో మిరాయ్ మూవీపై మరింత హైప్ పెరిగింది. బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ మిరాయ్ హిందీ రైట్స్ తీసుకోవడం విశేషం. హనుమాన్‌తో తేజ హిందీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడికి ఉన్న ఫాలోయింగ్ కారణంగా మిరాయ్ హిందీ రైట్స్ కరణ్ జోహార్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. మిరాయ్ హిందీ టీజర్‌ని తాజాగా విడుదల చేశారు.
తేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్..
ఈ విషయంలో అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. మిరాయ్ సినిమా హిందీలోని అగ్ర నిర్మాతైన కరణ్ జోహార్ తీసుకోవడంతో మూవీపై బజ్ మరింత పెరిగింది. ధర్మ ప్రొడక్షన్ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ. కరణ్ జోహార్ లాంటి దర్శక-నిర్మాత ఒక సినిమా విడుదల చేస్తున్నాడంటూ అది హిట్ అనే నమ్మకం ఉంది. అంతేకాదు కథలో దమ్ము ఉంటే తప్ప కరణ్ ఆ సినిమా రైట్స్ తీసుకోడు. అలాంటి ఆయన ప్రొడక్షన్ నుంచి మిరాయ్‌ని రిలీజ్ చేస్తున్నాడంటే ఆ సినిమా హిట్ కొట్టినట్టే. అంటే తేజ సజ్జా మరో బ్లాక్ బస్టర్ ఖాయం అయ్యిందని అంటున్నారు. హిందీలో ఈమూవీ రైట్స్ ధర్మ ప్రొడక్షన్ తీసుకోవడం.. మిరాయ్‌కి తెలుగులో బజ్ పెరుగుతోంది. కాగా మిరాయ్ మూవీలో కూడా సూపర్ హీరో జానర్‌కి మైథలాజికల్ టచ్ ఇచ్చాడు.
Also Read: Jr NTR Look: ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ అట్టర్ ప్లాప్… బీ టౌన్ ఆడియన్స్ రియాక్షన్ ఎంటంటే ?
భారతీయ ఇతిహాసం, ఆధునిక యాక్షన్-అడ్వెంచర్‌గా ఈ మూవీ కథ సాగనుందని టీజర్ చూస్తుంటే అర్థమైపోతుంది. మానవులను దేవతలుగా మార్చగల శక్తి ఉన్న తొమ్మిది పవిత్ర గ్రంథాలను రక్షించడానికి ఒక యోధుడు చేసే పోరాటం ఇది. ఈ గ్రంథాలను చక్రవర్తి అశోకుడికి చెందిన తొమ్మిది రహస్య గ్రంథాలుగా పేర్కొంటారు. వీటిని కాపాడేందుకు కారణ జన్ముడైన తేజా సజ్జా ఏం చేశాడనేది మూవీ కథ. కాగా మిరాయ్‌లో వీఎఫ్ఎక్స్, గ్రాఫీక్స్‌కి పెద్ద పీట వేశారు. ‘మిరాయ్’ సినిమా 2025 సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. టీజర్‌లో తేజా సజ్జా సూపర్ యోధుడిగా , మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, మంచు మనోజ్, శ్రియా చరణ్, మలయాళ నటుడు జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
From the ashes of the past, a SUPERYODHA is born.⚔️
An epic adventure awaits you. #MiraiTeaser Out Now.
In cinemas worldwide on 5th September, 2025.North India Release By Dharma Productions pic.twitter.com/EgYvD4nZLA
— Dharma Productions (@DharmaMovies) August 14, 2025