Viral video: ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా హవానే నడుస్తోంది. ప్రపంచం నలుమూలలా ఎక్కడేం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యంగా పాములు, ఏనుగులు, కామెడీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని ఎక్కువగా వీక్షిస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని ఓ మహిళా బస్సు్ డ్రైవర్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను లక్షల మంది చూస్తున్నారు. లక్షల మంది లైకులు, వేల మంది కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి నేహు ఠాకూర్ అనే మహిళ బస్సులను, ట్రక్కులను నడపుతోంది. అయితే వీటికి సంబంధించిన వీడియోలను తరుచుగా సోషల్ మీడియో పోస్ట్ చేస్తుంది. అయితే తాజాగా పోస్టు చేసిన బస్సు డ్రైవ్ చేస్తున్న వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ మహిళా బిజీగా బస్టాండులో బస్సు నడుపుతోన్న వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటుంది.
‘ఈ రోజు నేను బస్సు డ్రైవ్ చేస్తున్నాను. ప్రజలు, నెటిజన్లు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నేను బస్సును నడపడం చూసిన నెటిజన్లు కామెంట్ లను చూస్తే ఆనందంగా ఉంది. ఈరోజు బస్టాండ్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. బస్సు దిగడానికే నాకు పది నిమిషాల సమయం పట్టింది. పెద్ద మొత్తంలో జనం చూస్తూ ఉండిపోయారు’ అని ఆమె నేహు ఠాకూర్ చెప్పారు.
ALSO READ: DMart Offer: డీమార్ట్ అద్భుతమైన ఆఫర్.. ఇవన్నీ సగం ధరకే.. ఇదే మంచి అవకాశం
ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. మేరా రియాక్షన్ టోన్ థా: వోహ్.. ‘నువ్వు ఇంతగా డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నావు?’ అని కామెంట్ చేశాడు. మరొకరు ‘చాలా బాగుంది, నా ప్రియమైన సిస్టర్. నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అని పోస్ట్ చేశారు.