Bollywood Entry: తెలుగులో మంచి పేరు సంపాదించుకున్న చాలామంది హీరోలు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఉన్న పేరుని కాస్త పోగొట్టుకున్నారు అని చెప్పాలి. ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు. అయితే తెలుగులో కొన్ని సినిమాలు హిట్ అయిన తర్వాత బాలీవుడ్ లో కూడా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అందుకే పలు సందర్భాలలో మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అని అంటే, ఇప్పుడు అప్పుడే ఆలోచన లేదండి తెలుగులో చేయాల్సినవి చాలా సినిమాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు మహేష్ బాబు ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కేవలం తెలుగు ప్రేక్షకులు కోసం మాత్రమే సినిమా చేశాడు. మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ జంజీర్ సినిమాతో భారీ డిజాస్టర్ చూశాడు.
రామ్ చరణ్ కు బ్యాడ్ ఎక్స్పీరియన్స్
జంజీర్ సినిమా విడుదలైనప్పుడు అసలు ఎక్స్ప్రెషన్స్ పలకడం రావడం లేదు. అని విపరీతంగా అప్పట్లో హిందీ మీడియా ట్రోల్ చేసింది. అయితే వాటన్నిటికీ ట్రిపుల్ ఆర్ సినిమా సమాధానం చెప్పింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్న ప్రభాస్ హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. వి ఎఫ్ ఎక్స్ విషయంలో విపరీతమైన కామెంట్స్ ఎదుర్కొన్నాడు. ఇప్పటికే ఏదైనా సినిమాలో నాసిరకం విఎఫ్ఎక్స్ కనిపిస్తే ఆది పురుష్ సినిమా ట్రోలింగ్ కి వస్తుంది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ ఆ లిస్ట్ లోకి వెళ్లిపోయాడు అని చెప్పాలి.
తారక్ కు కూడా కలిసి రాలేదు
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమా వార్ 2. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రాక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో పడినప్పటి నుండే మిశ్రమ స్పందన రావడం మొదలైంది. కొంతమంది ఈ సినిమా గురించి బ్యాలెన్స్ గా చెబుతూ ఉంటే, మరి కొంతమంది మాత్రం ఈ సినిమా అసలు బాలేదు అని ఓపెన్ గా చెప్పడం మొదలుపెట్టారు. ఏదేమైనా రామ్ చరణ్, ప్రభాస్ ఫేస్ చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వార్ 2 సినిమాతో ఫేస్ చేశాడు అని చెప్పాలి. దీనిని బట్టి చాలామంది హీరోలు ముందు ముందు ఇంకొంచెం జాగ్రత్త పడే అవకాశం ఉంది.
Also Read: Soundarya Rajinikanth: కూలీ సినిమా రివ్యూ ఇచ్చిన రజనీకాంత్ కుమార్తె