E-Paper
Advertisement

వైరల్ వీడియో: వధువుకు షాకిచ్చిన వరుడు.. పెళ్లి వేదికపై అసలు ఊహించని ట్విస్ట్!

వైరల్ వీడియో: వధువుకు షాకిచ్చిన వరుడు.. పెళ్లి వేదికపై అసలు ఊహించని ట్విస్ట్!
Advertisement

Wedding Mistake : ఇండియన్ కల్చర్ అంటేనే హంగామాకి పెట్టింది పేరు.ఇక ఇక్కడ జరిగే పెళ్ళిళ్ళ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. రంగురంగుల పట్టుచీరలు, బ్యాండ్ బాజాల మోతలు, బంధుమిత్రుల సందడితో పెళ్లి పందిరి అంతా కోలాహలంగా ఉంటుంది. అయితే ఈ వేడుకల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అప్పుడప్పుడు కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి . ఇక అవి కాస్తా కెమెరాకు చిక్కితే ఇక సోషల్ మీడియాలో సెన్సేషనే. సరిగ్గా ఇలాంటిదే ఒక వింత ఘటన ఇప్పుడు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. జైమాల వేడుకలో వరుడు చేసిన ఒక చిన్న మిస్టేక్  ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

క్షణం కూడా ఆలస్యం చేయకుండా

Advertisement

సాధారణంగా పెళ్లిలో ముఖ్యంగా జరిగే తంతు ఏంటి .. వధూవరులు ఒకరికి ఒకరు పూలమాలలు మార్చుకోవడం. అలాగే ఇక్కడ కూడా  స్టేజ్ మీద లైట్ల వెలుతురు, చుట్టూ ఫోటోగ్రాఫర్ల ఫ్లాష్‌లు, బంధువుల కేకల మధ్య ఆ క్షణం ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా వధూవరులు పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతూ వేదికపై సిద్ధంగా ఉన్నారు. ముహూర్తం సమయం వచ్చింది కూడా. పంతులు గారు మాలలు మార్చుకోమని చెప్పేశారు.మాములుగా అయితే ఏం చేస్తారు.ఒకరి మెడలో మరొకరు దండ వేస్తారు.కానీ ఇక్కడే తప్పులో కాలేశాడు పెళ్లి కొడుకు.అమ్మాయిని చూసిన ఆనందమా లేక మొదటిసారి పెళ్లి జరుగుతుందన్న టెన్షనా తెలీదు కాని న చేతికి దండ అందగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అది వధువు మెడలో వేయాల్సింది పోయి..క్షణం ఆలోచించకుండా తన మెడలోనే వేసుకున్నాడు

also read :స్కూల్ ఈవెంట్ వివాదంలో చిక్కుకున్న రాజీవ్ కనకాల.. అసలు ఏం జరిగిందంటే?

Advertisement

ఆ సమయంలో వరుడి ముఖంలో ఉన్న సీరియస్‌నెస్ చూస్తే, తనే వధువు అనుకున్నాడా? లేక తన పెళ్లి తానే చేసుకుంటున్నాడా? అనే డౌట్ రాకుండా పోదు.ఇక వరుడు చేసిన ఈ వింత పనికి పక్కనే ఉన్న వధువు మైండ్ బ్లాక్ అయిపోయింది. “నేను ఇక్కడ ఉండగా నీ మెడలో నువ్వే దండ వేసుకోవడం ఏంటి సామీ?” అన్నట్లుగా ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు ఈ వీడియోకే హైలైట్‌గా నిలిచింది.

నవ్వాపుకోలేక కేకలు

ఇది చూసిన బంధువులు, అతిథులు ఒక్కసారిగా నవ్వాపుకోలేక కేకలు వేశారు. పెళ్లి పందిరి అంతా ఒకటే నవ్వులు. అందరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక ఆ వరుడు కాసేపు బిత్తరచూపులు చూశాడు. ఒక రెండు సెకన్ల తర్వాత మెల్లగా అసలు విషయం అర్థం కావడంతో సిగ్గుతో ముఖం దాచుకుంటూ వెంటనే తన మెడలోని మాల తీసి వధువు మెడలో వేశాడు. ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ఆ సీన్ కాస్తా ఫోన్లలో రికార్డ్ అయి నెట్టింట్లోకి వచ్చేసింది.

కొద్దిసేపటికే లక్షల్లో వ్యూస్

ఇక ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ (ట్విట్టర్)లలో షేర్ అయిన కొద్దిసేపటికే లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ఇక ఇది అలా వచ్చిందో లేదో పాపం ఆకలేస్తుందనేమో అందుకే అలా త్వరగా లేట్ చేయకుండా మెళ్ళో వేసుకున్నాడు అని కొందరంటుంటే, అమ్మాయి కన్నా తనని తానె బాగా లవ్ చేసుకుంటున్నాడేమో అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఆ క్షణంలో పడ్డ చిన్న పాటి టెన్షన్ లైఫ్ మొత్తానికి మెమరబుల్ గా నిలిచిపోయిందన్న మాట!

also read :అండర్ వాటర్ యాక్షన్ కోసం ఏకంగా వారణాసికే.. మహేశ్‌ – రాజమౌళి రిస్క్ మామూలుగా లేదుగా!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×