E-Paper
Advertisement

స్టార్ హీరోల టార్గెట్ తట్టుకోలేక ముంబై చెక్కేసారా? సునీల్ నారంగ్ ప్లాన్ బి ఇదేనా?

స్టార్ హీరోల టార్గెట్ తట్టుకోలేక ముంబై చెక్కేసారా? సునీల్ నారంగ్ ప్లాన్ బి ఇదేనా?
Advertisement

Theatre Politics: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మరియు ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ అకస్మాత్తుగా ముంబై (బాంబే) షిఫ్ట్ అయిపోవడం, ఆ వెంటనే తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ రావు బాధ్యతలుచేపట్టడం వెనుక ఒక భారీ స్కెచ్ ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

తన గుప్పిట్లోనే ఉంచుకునే వ్యూహం

Advertisement

అవును..ఈ వ్యూహంలో భాగంగానే శిరీష్, సునీల్ నారంగ్ కలిసే తమకి అనుకూలమైన వ్యక్తి అయిన జువ్వాడి శేఖర్ రావును అధ్యక్షుని పీఠంపై కూర్చోబెట్టారని, దీని వెనుక టాలీవుడ్ థియేటర్ల వ్యవస్థను తన గుప్పిట్లోనే ఉంచుకునే వ్యూహం దాగుందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Also read :సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రామ్ పోతినేని వీడియో.. అసలు విషయం తెలిసి ఫిదా అవుతున్న టాలీవుడ్

Advertisement

ఒకప్పుడు అసలైన థియేటర్ల యజమానులకు అండగా నిలిచిన తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఇప్పుడు కేవలం ‘లీజుదారుల’ అడ్డాగా మారిపోయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. థియేటర్లను అద్దెకు తీసుకుని నడిపించే లీజుదారులు మాత్రమే అక్కడ తిష్ఠ వేశారని, నిజమైన ఓనర్లు ఎవరూ కూడా ఇప్పుడు ఛాంబర్ నిర్ణయాల్లో భాగస్వాములు కాలేకపోతున్నారని ఇండస్ట్రీ పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు.

దిల్ రాజు వ్యూహాత్మక డ్రామా

ఈ మొత్తం వ్యవహారం వెనుక టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు వ్యూహాత్మక డ్రామా నడుపుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు జోరందుకున్నాయి. పైకి చూస్తే జూన్ 4న విడుదల కాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవని, అంతా సజావుగానే సాగిపోతోందని దిల్ రాజు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ, తెర వెనుక మాత్రం లీజుదారుల డామినేషన్ ని కాపాడుకోవడానికి పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది.ఇక గత కొన్నాళ్లుగా సినిమా పరిశ్రమలో థియేటర్ల కేటాయింపులు, రిలీజ్ డేట్ల వివాదాలు, ముఖ్యంగా అగ్ర హీరోల నుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిళ్లను తట్టుకోలేకే సునీల్ నారంగ్ హైదరాబాద్‌ను వీడి బాంబే వెళ్ళిపోయారనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

థియేటర్లపై తన పట్టు సడలకుండా

నిజానికి గత ఏడాది కాలంగా తెలుగు ఇండస్ట్రీలో  థియేటర్ల పంపకాల వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత పెద్ద సినిమాలకు ఎక్కువ స్క్రీన్లు కేటాయించడం, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకకపోవడం వంటి అంశాలపై తీవ్ర చర్చ నడిచింది. 2024 చివర్లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాల సమయం నుంచి మొదలైన ఈ వివాదం, ఇటీవల కాలంలో మరీ ఎక్కువైంది.

Also read :30 ఏళ్ల క్రితం చిరు ఇప్పుడు పవన్..‘మెగా 158’ వేడుకలో రివర్స్ అయిన సీన్.. వైరల్ అవుతోన్న ట్వీట్!

తాజాగా జరిగిన పరిణామాలను గమనిస్తే, సునీల్ నారంగ్ హైదరాబాద్‌లో లేకపోయినా తెలంగాణ థియేటర్లపై తన పట్టు సడలకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ రావు ఎన్నిక కావడం వెనుక సునీల్ నారంగ్, శిరీష్ వ్యూహాత్మక మద్దతు పూర్తిగా ఉందనే వాదనలు బలంగా
వినిపిస్తున్నాయి.అందుకే అతని మీద నిర్మాతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది .శేఖర్ రావు ఎగ్జిబిషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తినే అయినప్పటికీ, ఆయన నారంగ్ వర్గానికి చెందినవారే కావడంతో శనివారం జరగనున్న మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా !

బాంబే స్క్రీన్‌ప్లే ఇండస్ట్రీని ఏ మలుపు తిప్పుతుందో

మొత్తానికి  బాంబేలో ఉంటూనే ఇక్కడి థియేటర్ల నెట్‌వర్క్‌ను, రాబోయే పెద్ద సినిమాల బిజినెస్‌ను తన కంట్రోల్‌లో ఉంచుకోవడానికే ఈ మార్పులు చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తున్నటాక్.  రాబోయే రోజుల్లో స్టార్ హీరోల చిత్రాల నైజాం థియేటర్ల కేటాయింపుల్లో శేఖర్ రావు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, సునీల్ నారంగ్ బాంబే స్క్రీన్‌ప్లే ఇండస్ట్రీని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.

Tags

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×