E-Paper
Advertisement

వైష్ణవ్ తేజ్ – రీతూ వర్మ పెళ్లికి సాయి దుర్గ తేజ్, తల్లి నో చెప్పారా!

వైష్ణవ్ తేజ్ – రీతూ వర్మ పెళ్లికి సాయి దుర్గ తేజ్, తల్లి నో చెప్పారా!
Advertisement

Vaishnav Tej and Ritu Varma: రీతూ వర్మా – వైష్ణవ్ తేజ్ …ఈ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు అంటూ వార్తలు గేట్లేత్తేసిన వాటర్ లా పరవళ్ళు తొక్కుతూనే ఉన్నాయి. ఇక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ దీనికి మెగా ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి కూడా. అయితే అదంతా అబద్దం అసలు మెగా ఫ్యామిలీలో ఎవరికీ ఈ పెళ్లి ఇష్టం లేనేలేదన్న టాక్ లేటెస్ట్ గా వినిపిస్తుంది.

మెగా ఫ్యామిలీ ఇంట్లో గొడవలు 

Advertisement

అవును ..వీరి  ప్రేమ వ్యవహారం ఈ మధ్యనే రెండు కుటుంబాల దృష్టికి వెళ్లిందని యాక్  వీరి పెళ్ళి విషయమై మెగా ఫ్యామిలీ ఇంట్లో చర్చకు రావడంతో తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అసలు ఈ పెళ్లి ప్రతిపాదనకు మెగా ఫ్యామిలీ  ఏ మాత్రం ఒప్పుకునేలా లేదని తెలుస్తోంది.ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ అన్న అయిన సాయి దుర్గ తేజ్ తో పాటు, వారి తల్లి విజయా దుర్గ  కూడా ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదని ఇండస్ట్రీ టాక్.కుటుంబ సభ్యులు ఈ మ్యాటర్ లో చాలా సీరియస్ గా ఉన్నారని ,ఈ సంబంధం ఏ మాత్రం కుదిరే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

also read:సూర్య సినిమా థియేట్రికల్ రైట్స్ లొల్లి.. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు షాక్!

Advertisement

వైష్ణవ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం డౌన్ ఫాల్

వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే 2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఉప్పెనతో బుచ్చి బాబు దర్శకత్వంలో సాలిడ్ హిట్ కొట్టి మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు ఈ మెగా అబ్బాయి.అయితే ఆ తర్వాత 2021 అక్టోబర్ లో ‘కొండ పొలం’,2022 సెప్టెంబర్ లో ‘రంగ రంగ వైభవంగా’,2023 నవంబర్ లో ‘ఆదికేశవ’ వంటి సినిమాలతో వరుస ఫ్లాపులు చూసిన వైష్ణవ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉందనే చెప్పాలి.

మరోవైపు పెళ్లి చూపులతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రీతూ వర్మ 2020లో ‘కనులు కనులను దోచాయంటే’, 2021 లో ‘టక్ జగదీష్’, 2022 లో ‘ఒకే ఒక జీవితం’, 2023 లో ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న సంగతి తెల్సిందే.

మెగా ఫ్యామిలీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో !

ఏది ఏమైనా ఇపుడు రీతూ వర్మతో సంబంధం కంటే, ప్రస్తుతం వైష్ణవ్ పూర్తిస్థాయిలో తన సినిమాలపైనే దృష్టి పెట్టాలని ఇంట్లో పెద్దలు సూచించినట్లు చెబుతున్నట్టు సమాచారం.మొత్తానికి ఈ సంఘటనతో ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ – రీతూ వర్మల ప్రేమాయణం ఎటు వైపు సాగుతుందా అన్న క్యూరియాసిటీ ఇపుడు అందరిలోనూ కనిపిస్తుంది. చూడాలి మరి తెగ చక్కర్లు కొడుతున్న ఈ రూమర్స్ పై మెగా ఫ్యామిలీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో !

also read:‘ఆ అక్కలంతా ఏమైపోయారు?’.. NEET పేపర్ లీక్‌పై స్పందించిన అనసూయ!

Related News

‘అమరన్’ డైరెక్టర్‌తో ధనుష్ ఊచకోత.. ‘ఓం’ టైటిల్ టీజర్ చూశారా?

‘చెన్నై లవ్ స్టోరీ’కి రూ.కోటి రూపాయల ఫ్రీ టికెట్లు?ఏంటిది కిరణ్?

ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారంటూ సంచలన ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్!

సూర్య సినిమా థియేట్రికల్ రైట్స్ లొల్లి.. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు షాక్!

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న చెన్నై లవ్ స్టోరీ బ్యూటీ.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

‘ఆ అక్కలంతా ఏమైపోయారు?’.. NEET పేపర్ లీక్‌పై స్పందించిన అనసూయ!

అఖిల్ ఏ దేశ పౌరుడో తెలుసా.. త్వరలోనే?

Big Stories

Advertisement
×