E-Paper
Advertisement

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ గుడ్ బాయ్ అనిపించుకున్నాడా ? ఫుల్ రివ్యూ

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ గుడ్ బాయ్ అనిపించుకున్నాడా ? ఫుల్ రివ్యూ
Advertisement

Bad Boy karthik :ఊహలు గుస గుస లాడే, ఛలో వంటి సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా స్టాంప్ వేసుకున్న నాగ శౌర్య గత కొంతకాలంగా హిట్టు పట్టుకోలేక తల పట్టేసుకుంటున్నాడు. ముఖ్యంగా ఛలో తరువాత చేసిన సినిమాలు చేసినట్టే పోవడంతో, మూడేళ్ల తరువాత వస్తున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరి థియేటర్లోకి వచ్చేసిన ఈ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ గుడ్ బాయ్ అనిపించుకున్నాడా లేక బ్యాడ్ బాయ్ గానే మిగిలిపోయాడా చూద్దాం!

కథ

Advertisement

విశాఖపట్నంలో ఉండే కార్తీక్ (నాగ శౌర్య) కి తన అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్‌కుమార్) అంటే ప్రాణం. లాయర్ అయిన కస్తూరి, బాధ్యత లేకుండా గొడవలు పడుతూ తిరిగే తన తమ్ముడిని మార్చాలని, విదేశాలకు పంపాలని ట్రై చేస్తుంది. కానీ అక్కను వదిలి వెళ్లడం కార్తీక్‌కు అస్సలు ఇష్టం ఉండదు. మరోవైపు సీమ ప్రాంతంలో గోవిందప్ప (మైమ్ గోపి) మరియు వరదారెడ్డి (సముద్రఖని) అనే భూస్వాముల బారిన పడ్డ అమాయక రైతుల పక్షాన నిలబడి, వాళ్ల కంట్లో నలుసులా మారుతుంది. దీంతో గోవిందప్ప అండ్ గ్యాంగ్ ఆమెకి స్కెచ్ వేస్తారు. తన అక్క ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలుసుకున్న కార్తీక్ అక్కను, రైతుల భూములను ఎలా కాపాడాడు? అన్నదే సినిమా కథ.

నటీనటులు

Advertisement

ఒకప్పుడు ‘ఛలో’ సినిమాలో చూసిన ఆ క్యూట్ చార్మ్, గ్లో ఇప్పుడు శౌర్య బాబు ఫేస్‌లో అస్సలు కనిపించలేదు. బాడీ కోసం తన నేచురల్ లుక్ ని పాడు చేసుకున్నాడేమో అనిపిస్తుంది. కటౌట్ ఫిట్ గా ఉన్నా, ఆ పాత కళ మాత్రం కనిపించలేదు. పైగా ఇలాంటి అవుట్ డేటెడ్ కథలు ఎందుకు ఒప్పుకుంటున్నాడో ఆయనకే తెలియాలి! అక్కగా చేసిన శ్రీదేవి విజయ్‌కుమార్ ఉన్నానంటే ఉన్నా అన్నట్టుగా ఉంది తప్ప ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయింది. వెన్నెల కిషోర్ ఉన్నాడుగా కాసేపు నవ్వుకుందామని ఆశపడి లోపలికి వెళ్లి ఆయన ట్రాక్ చూస్తే నవ్వు కాదు కదా, సవాలక్ష ప్రశ్నలు వస్తాయి. ఇక సాయి కుమార్ లాంటి సీనియర్ నటుడిని బఫూన్ రోల్‌లో చూడటం అయితే పెద్ద టార్చర్ అనే చెప్పాలి.

విశ్లేషణ

ఏసీలో కూర్చున్నా సరే ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చూస్తుంటే ఆడియన్స్ రక్తం వేడెక్కుతుందంటే బాబు గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఎంత వీక్ గా ఉందో అర్థమవుతుంది. హీరో ఇంట్రడక్షన్, లాజిక్ లేని లవ్ ట్రాక్ లు చూస్తుంటే “అయ్యా డైరెక్టర్ గారూ… మాకొద్దు ఈ రోత” అని మొత్తుకోవాలనిపిస్తుంది. హీరోయిన్ విధి యాదవ్ గ్లామర్ షో తప్ప నటనలో జీరో. హీరో-హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ చూస్తుంటే బాబోయ్ అంటున్నారు ప్రేక్షకులు. ఇక విలన్ తలను హీరో నరికే ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే పవన్ కళ్యాణ్ ‘OG’ గ్లింప్స్ నుంచి ఎత్తేసినట్టు అనిపిస్తుంది. సినిమాలో చెప్పుకునే ఆ ఒక్క సీన్ కూడా కాపీ అనిపిస్తే డైరెక్టర్ టేకింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హారిస్ జయరాజ్ పాటలు బుర్రలోకి ఎక్కవు, రసూల్ ఎల్లోర్ విజువల్స్ కిక్కు ఇవ్వవు. ఎడిటింగ్ అయితే అతుకుల బొంతే.

బలాలు

  • ఇంటర్వెల్ ఫైట్

బలహీనతలు

  • అవుట్ డేటెడ్ స్టోరీ
  • బోరింగ్ ట్రీట్ మెంట్
  • లవ్ ట్రాక్

చివరిగా

బాడీ పెంచేస్తే సరిపోదు… కథలో దమ్ము కూడా ఉండాలి అని మరోసారి ప్రూవ్ చేశాడు నాగ శౌర్య. సో ఈ మండే ఎండల్లో కష్టపడి పెట్రోల్ పోయించుకుని థియేటర్ కు వెళ్లి టైమ్, పైసలు అస్సలు వేస్ట్ చేసుకోకండి. హాయిగా ఇంట్లోనే ఉండి చల్లగా మజ్జిగ తాగుకుంటూ పాత సినిమాలు చూసుకోండి. అర్థమైందిగా!

Bad Boy karthik Review and Rating – 1/5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×