E-Paper
Advertisement

War Machine: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్నసైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ మెషిన్’.. విమర్మకులు సైతం..

War Machine: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్నసైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ మెషిన్’.. విమర్మకులు సైతం..
Advertisement

War Machine: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న అలాన్ రిచ్‌సన్ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ మెషిన్’ (War Machine) విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది. అలాన్ రిచ్‌సన్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ‘వార్ మెషిన్’, ప్రముఖ రివ్యూ వెబ్‌సైట్లో ప్రస్తుతం 68% విమర్శకుల స్కోరుతో ‘ఫ్రెష్’ సర్టిఫికేట్‌ను అందుకుంది. ‘రీచర్’ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌డమ్ సంపాదించుకున్న రిచ్‌సన్, ఈ సినిమాలో ఆర్మీ రేంజర్ పాత్రలో తనదైన ముద్ర వేశారు. కేవలం విమర్శకులే కాకుండా, సాధారణ ప్రేక్షకుల నుండి కూడా ఈ చిత్రానికి 73% పాప్‌కార్న్‌మీటర్ స్కోరు లభించడం విశేషం. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో యాక్షన్ సినిమాలకు ఉండే క్రేజ్‌ను ఈ చిత్రం మరోసారి నిరూపించింది.

Read also-Psychological Drama OTT: ఇంట్లోనే మాటు వేసే మొగుడు… భార్య చేసే పనులకు ఫ్యూజులు అవుట్

కథాశం ఎంటంటే?

Advertisement

ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, ఒక కఠినమైన ఆర్మీ రేంజర్ శిక్షణా శిబిరం నేపథ్యంలో సాగుతుంది. శిక్షణలో భాగంగా అడవిలోకి వెళ్ళిన ఒక సైనిక బృందం, అక్కడ అనుకోకుండా ఒక గ్రహాంతర వాసులకు సంబంధించిన అత్యంత శక్తివంతమైన రోబోటిక్ యంత్రాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ యంత్రం నుండి ప్రాణాలతో బయటపడటానికి వారు చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. దర్శకుడు పాట్రిక్ హ్యూస్ ఈ కథను పాతకాలపు యాక్షన్ సినిమాల శైలిలో, ఆధునిక విజువల్స్ జోడించి తెరకెక్కించారు.

విమర్శకులు..

విమర్శకుల విశ్లేషణ ప్రకారం, ఈ సినిమాలో రిచ్‌సన్ స్క్రీన్ ప్రెజెన్స్ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లు. ముఖ్యంగా క్లోజ్-క్వార్టర్ ఫైట్స్, శారీరక శ్రమతో కూడిన సన్నివేశాలను చాలా సహజంగా చిత్రీకరించారని ప్రశంసలు దక్కాయి. అయితే, కథలో కొత్తదనం తక్కువగా ఉండటం, కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటివి సినిమాకు కొంత బలహీనతలుగా మారాయి. క్లైమాక్స్ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Advertisement

Read also-Anchor Rashmi:నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మీ.. ప్రూఫ్స్ కావాలంటూ కౌంటర్!

సినిమా ముగింపును గమనిస్తే, దీనికి సీక్వెల్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దర్శకుడు, నటుడు ఇద్దరూ ‘వార్ మెషిన్ 2’ కోసం ఇప్పటికే కొన్ని ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగితే, త్వరలోనే పార్ట్-2 ప్రకటన వచ్చే అవకాశం ఉంది. యాక్షన్ సైన్స్ ఫిక్షన్ జోనర్ ఇష్టపడే వారికి, ఎటువంటి సంక్లిష్టత లేకుండా కేవలం వినోదం కోసం చూసేందుకు ఇది ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×