E-Paper
Advertisement

TGSPDCL: ఎస్పీడీసీఎల్‌ పరిధి విద్యుత్ వినియోగంలో సింహభాగం వీరిదే..?

TGSPDCL: ఎస్పీడీసీఎల్‌ పరిధి విద్యుత్ వినియోగంలో సింహభాగం వీరిదే..?
Advertisement

TGSPDCL: స్వేచ్ఛ బ్యూరో: ఆధ్యాత్మిక నగరాల నుంచి పారిశ్రామిక వాడల వరకు, పల్లె ముంగిట నుంచి ఐటీ కారిడార్ల వరకు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వెలుగులు జిమ్ముతోంది. రాష్ట్ర పురోగతిలో కీలకంగా మారిన ఈ సంస్థ 1.17 కోట్ల వినియోగదారులతో అత్యుత్తమ నెట్‌వర్క్ కలిగిన డిస్కంలలో ఒకటిగా నిలిచింది. నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా ఎస్పీడీసీఎల్ తన పరిధిని అమాంతం పెంచుకుంది. నాడు అరకొర సబ్ స్టేషన్లతో ఉన్న వ్యవస్థ, నేడు అప్రతిహతంగా విస్తరించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలను సంస్థ భారీగా మెరుగుపరిచింది. దీంతో ఎస్పీడీసీఎల్ నెట్ వర్క్ ను విస్తతంగా పెంచుకోగలిగింది.

21 ఆపరేషన్ సర్కిళ్లు

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 10 లోక్ సభ స్థానాలు, 65 అసెంబ్లీ సెగ్మెంట్లు, 15 జిల్లాల్లో విస్తరించి ఉంది. 21 ఆపరేషన్ సర్కిళ్లు ఈ సంస్థ సొంతం. వీటిలో మొత్తం కలిపి 1.17 కోట్ల మంది వినియోగదారులకు ఎస్పీడీసీఎల్ విద్యుత్ వెలుగులు అందిస్తోంది. సంస్థ పరిధిలో ప్రస్తుతం 1,808(33/11 కేవీ) సబ్ స్టేషన్లు నిరంతరం సేవలు అందిస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు లేకుండా ఉండేందుకు 3,620 పీటీఆర్లు, గల్లీ గల్లీలో 6,04,490 డీటీఆర్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ తీగలు ఇపుడు ఏకంగా 3,96,900 కిలోమీటర్ల మేర విస్తరించి వెలుగులను అందిస్తోంది.

Advertisement

Also Read: Tiger Movement: హమ్మయ్యా.. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెల్లిని పెద్దపులి..?

ప్రథమ స్థానంలో..?

ఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం వినియోగదారుల సరళిని పరిశీలిస్తే గృహ అవసరాలకే సింహభాగం ప్రాధాన్యత లభిస్తోంది. గతేడాది డిసెంబర్ లో విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కం ఏఆర్ఆర్ సమర్పించే నాటికి మొత్తం కనెక్షన్లలో 73.63 శాతం వాటాతో గృహ వినియోగదారులు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇక అగ్రికల్చర్ వినియోగదారులు 12.78 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. కమర్షియల్ వినియోగదారులు 11.43 శాతం, ఇండస్ట్రియల్ వినియోగదారులు 0.59 శాతం మంది ఉన్నారు. గృహ వినియోగదారులు 9,309 మిలియన్ యూనిట్లు వినియోగించారు. వ్యవసాయానికి 8,273 మిలియన్ యూనిట్లు, కమర్షియల్ 6,163 మిలియన్ యూనిట్లు, ఇండస్ట్రియల్ వినియోగం 12,320 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. వినియోగదారుల సంఖ్య 1.17 కోట్లకు చేరడం సంస్థపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అధికారులు పేర్కొంటున్నారు. మున్ముందు అంతరాయం లేని సరఫరా కోసం మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది.

Advertisement

Also Read: Women Safety: మీ మౌనమే మీకు చాలా ప్రమాదకరం.. ధైర్యంగా ముందుకు రండి..?

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×