Youth Trailer: కెన్ కరునాస్ (Ken Karunaas), అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ ‘యూత్’ (Youth Movie). ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకులకు అందివ్వబోతున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. మార్చి 26న ఈ మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరో వైపు చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్‌తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర థియేట్రికల్ ట్రైలర్ (Youth Trailer)ను గురువారం మేకర్స్ వదిలారు. ఈ ట్రైలర్ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసిందనే చెప్పుకోవాలి. ఇటీవల వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ని తలపించేలా ఉన్న ఈ మూవీ, నిజంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
Also Read- Parking Fees: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వారికి గుడ్ న్యూస్!
ట్రైలర్‌ని గమనిస్తే.. కాలేజ్ డేస్‌లోని కలర్ ఫుల్ లైఫ్ అంతా ఈ ట్రైలర్‌లో కనిపిస్తోంది. జూనియర్ ఇంటర్‌లో చేరిన ప్రవీణ్ అండ్ గ్యాంగ్ చేసే హంగామా.. రేపు థియేటర్లలో చూసే ప్రేక్షకులను కచ్చితంగా వెనక్కి తీసుకెళుతుంది. ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్‌లో డ్యాన్సులు, కాలేజ్‌లో చేరిన తర్వాత ఏర్పడే ప్రేమలు, సీనియర్స్‌తో ఫైట్స్.. ఇవన్నీ ఈ ట్రైలర్‌లో ఎంతో ఎంటర్ టైనింగ్‌గా చూపించారు. మదర్ మేరీ జూనియర్ కాలేజ్‌లో చదివే స్టూడెంట్ ప్రవీణ్‌గా ఇందులో హీరో నటించారు. అతనిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ప్రవీణ్ కలెక్టర్ అవుతాడని అతని తల్లి నమ్మకం పెట్టుకుంటుంది. తండ్రికి మాత్రం కొడుకు మీద ఎలాంటి ఆశలు ఉండవు. మీ ఫోకస్ అంతా స్టడీస్ మీదే ఉండాలని కాలేజ్ ప్రిన్సిపల్ చెబితే, ప్రవీణ్ మైండ్‌లో మాత్రం లవ్ లవ్ లవ్ అనే ఒకే ఒక్క ఆలోచన ఉంటుంది. అందరు కాలేజ్ కుర్రాళ్లలాగే ప్రవీణ్ సినిమా స్టార్స్‌ను అభిమానిస్తూ, అమ్మాయిల ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటాడు. అదే టైమ్‌లో కాలేజ్‌లో సీనియర్స్‌తో ఫైట్స్ చేస్తుంటాడు.
Also Read- Spider Man Brand New Day: స్పైడర్ మ్యాన్ ‘బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్.. ఎలా ఉందంటే?
ఒకమ్మాయి ప్రేమించినా చాలు అనుకుని ప్రవీణ్ ట్రై చేస్తుంటే, అతన్ని సర్‌ప్రైజ్ చేస్తూ ముగ్గురు అందమైన అమ్మాయిలు వెంట పడుతుండటం ఇందులో చూపించారు. దీంతో పట్టరాని సంతోషంలో ఉన్న ప్రవీణ్‌కు ఒక్కో ట్విస్ట్ రివీలవుతుంటుంది. ఈ ముగ్గురిలో ప్రవీణ్‌ను ఎవరు ప్రేమించారు, ప్రవీణ్ ఎవర్ని ప్రేమించాడు? అనేదే ఈ సినిమా అనేలా ట్రైలర్ కట్ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎలాంటి కలలుకన్నారు. తమ కాలేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేసే ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ కోసం ఎప్పుడు రియలైజ్ అయ్యారు అనే అంశాలను మూవీలోనే చూడాలని అంటున్నారు మేకర్స్. కెన్ ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ ట్రైలర్‌లో హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ చివరలో ప్రభాస్ ‘రాఘవేంద్ర’ సినిమాలోని ‘కలకత్తా పానేసినా చూసుకో…’ పాట మరింత ఆసక్తికరంగా ఈ ట్రైలర్‌ని మలిచింది. మొత్తంగా అయితే ఈ ట్రైలర్ తర్వాత సినిమా చూడాలనుకునే వారి సంఖ్య.. మరీ ముఖ్యంగా యూత్ పెరిగిపోతారని మాత్రం చెప్పొచ్చు.
Also Read- Harish Shankar: ‘ఉస్తాద్’లాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు.. ఎందుకు అంటున్నానంటే?