E-Paper
Advertisement

సీతమ్మ గెటప్ నుంచి ఐటమ్ బాంబుగా.. ఊర మాస్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ బ్యూటీ

సీతమ్మ గెటప్ నుంచి ఐటమ్ బాంబుగా..  ఊర మాస్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ బ్యూటీ

Kriti Sanon: కృతి సనన్ …ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా ..యస్ మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’లో మెరిసింది ఈ ముద్దుగుమ్మే. పేరొచ్చినా డబ్బులు రాకపోవడంతో పెద్దగా మన మేకర్స్ పట్టించుకోలేదు. ఇక నాగ చైతన్యతో ‘దోచేయ్’ అంటూ చేసినా తెలుగు ఆడియన్స్ అభిమానాన్ని మాత్రం దోచుకోలేకపోయింది. ఇక టాలీవుడ్ కి టాటా చెప్పేసి బాలీవుడ్ లో దిల్ వాలే , రాబ్తా , హౌస్ ఫుల్ 4 సినిమాలతో బిజీ అయిపోయిన ఈ పొడుగు కాళ్ళ భామ మిమి తో ప్రెగ్నెంట్ ఉమెన్ గా నేషనల్ అవార్డ్ కొట్టేయడం విశేషం.

ఆదిపురుష్ సినిమాలో సీతమ్మగా

ఇక చాలా రోజులకి మన ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో సీతమ్మగా మరోసారి మెప్పించినా సినిమా మాత్రం ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఇక అడపా దడపా సినిమాలు చేస్తూ బండి లాగిస్తున్న కృతి ఇపుడు ‘ఐటమ్ సాంగ్స్’ చేయడానికి రెడీ అయిందట. అవును… వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాలో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ కోసం కాళ్ళు కదిపేందుకు ఒప్పుకుందట.

also read: మెగా కాంపౌండ్‌లో ‘సర్జరీ’ల కలకలం! ఒకరి తర్వాత ఒకరు.. అసలు ఏమవుతోంది?

స్పెషల్ సాంగ్స్ ఒకే చెప్పి కెరీర్  కొలాప్స్

నిజానికి ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే వంటి టాప్ హీరోయిన్స్ ఉండగా కేవలం ఒక్క సాంగ్ కోసమే కృతిని అప్రోచ్ అవ్వడం గమనార్హం. అయితే అటు హీరోయిన్ గా, ఇటు స్పెషల్ సాంగ్స్ బ్యూటీ గా రెండు చేతుల్లో నటిస్తుంది గా అని కొందరంటుంటే , నేషనల్ అవార్డీ అని గొప్పలు చెప్పుకుంటున్న అమ్మడు ఇప్పుడు ఇలాంటి స్పెషల్ సాంగ్స్ కి ఒకే చెప్పి కెరీర్ ని కొలాప్స్ చేసుకుంటుందిగా అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.

ఫార్ములాను వాడి మళ్ళీ ఫామ్‌లోకి

అయితే ఈ స్పెషల్ సాంగ్ కి సంబందించిన విశేషాలని మేకర్స్ చాలా సైలెంట్ గా ఉంచుతుండటంతో ఆమెకు పెద్దగా క్రేజ్ లేకపోవడం వల్లే మేకర్స్ సైలెంట్‌గా ఉన్నారా ఏంటి అన్న టాక్ బీ టౌన్ లో వినిపిస్తుంది. చూస్తుంటే సమంత, పూజా హెగ్డే వంటి వారు ఐటమ్ సాంగ్స్‌తో హిట్లు కొట్టారు కాబట్టి, తాను కూడా ఆ ఫార్ములాను వాడి మళ్ళీ ఫామ్‌లోకి రావాలని కృతి ప్లాన్ వేసినట్టుంది.

ఈ సాంగ్ అయినా కృతి కెరీర్ ని మలుపు తిప్పుతుందా

అయితే, ‘ఆదిపురుష్’లో సీతగా కనిపించిన ఈమె ఒక్కసారిగా ఇలా స్పెషల్ సాంగ్స్ లో హట్ హాట్ గా కనిపించబోతుండటం చూస్తే ఆమె ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ అయ్యేలానే ఉంది. దీంతో ఇలా కేవలం కాసుల కోసమో, లేదా ఛాన్స్‌లకోసమో ఇలాంటి డిసీషన్స్ తీసుకుంటే కృతి సనన్ కెరీర్ కి త్వరలోనే ఎండ్ కార్డ్ పడటం ఖాయం అన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ఇక ఈ అమ్మడి చేతిలో హీరోయిన్ గా ప్రస్తుతం కాక్ టెయిల్ 2 ఒక్కటే ఉన్నట్టు కనిపిస్తుంది. చూడాలి ఈ స్పెషల్ సాంగ్ అయినా కృతి కెరీర్ ని మలుపు తిప్పుతుందో లేక వివాదాల బాట పట్టిస్తుందో!

also read: ఒకరిని చంపితే.. పది మంది వణుకుతారు! – బాలీవుడ్ మాఫియా గుట్టు విప్పిన ఆర్జీవీ!

Related News

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

Big Stories

×