AI Voice Cloning Scam: సైబర్ నేరగాళ్లు AI తో డబ్బులు కొట్టేస్తు్న్నారు. AI సాధనాలు, ఆన్ లైన్ లోని ఆడియో క్లిప్స్ ఉపయోగించి.. AI వాయిస్ క్లోనింగ్ స్కామ్ లకు పాల్పడుతున్నా్రు. తెలిసిన వ్యక్తే మాట్లాడుతున్నాడా అనేలా వాయిస్ క్లోనింగ్ చేసి డబ్బులు అడుగుతున్నారు. డిజిటల్ అరెస్ట్, కిడ్నాప్, యాక్సిడెంట్, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిందని.. ఇలా ఏదొక ఎమర్జెన్సీని క్రియేట్ చేస్తున్నారు. బాధితులు త్వరగా స్పందించేలా వారిపై ఒత్తిడి చేస్తున్నారు. పదే పదే కాల్స్ OTPలు, ఏటీఎం కార్డు, బ్యాంకు అకౌంట్ వివరాలు లేదా డబ్బు పంపమని ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.
తెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్ పట్ల అలర్ట్ గా ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అంటూ వచ్చే కాల్స్ ను ముందుగా మీ కుటుంబ సభ్యులతో వెరిఫై చేసుకోండి. అత్యవసర కాల్స్ వచ్చిన టైంలో ప్రశాంతంగా ఉండండి. సైబర్ మోసగాళ్లు మన భయాందోళనలను ఆసరాగా చేసుకుంటారు. కుటుంబ సభ్యులు, బాగా దగ్గర వారికి మాత్రమే తెలిసేలా ‘ఫ్యామిలీ సేఫ్ కోడ్’ ను సెట్ చేసుకోండి. కాల్ చేసే వ్యక్తి నిజమైనవాడో కాదో ఈ కోడ్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బ్యాంకు, ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ OTPలు, PINలు లేదా పాస్‌వర్డ్‌లను అడగరని గుర్తు పెట్టుకోండి.
Also Read: సైబర్ క్రిమినల్స్‌తో జత కట్టిన 208 మంది అరెస్ట్.. వీరిలో ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి..!
ఆన్‌లైన్ మోసాలను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండి. లేదా 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి సైబర్ మోసాలను రిపోర్టు చేయవచ్చు.
మీకు ఏవైనా ఫిషింగ్ / అనుమానాస్పద ఇ-మెయిల్‌లు లేదా ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే, వెంటనే sancharsaathi.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు.