E-Paper
Advertisement

ఒకరిని చంపితే.. పది మంది వణుకుతారు! – బాలీవుడ్ మాఫియా గుట్టు విప్పిన ఆర్జీవీ!

ఒకరిని చంపితే.. పది మంది వణుకుతారు! – బాలీవుడ్ మాఫియా గుట్టు విప్పిన ఆర్జీవీ!
Advertisement

Ram Gopal Varma:రామ్ గోపాల్ వర్మ ..శివ సినిమాతో రికార్డులు తిరగరాసి కొన్నేళ్ళ పాటు బాలీవుడ్ ని ఏలిన ఈ దిగ్గజ్జ దర్శకుడు ఇపుడు చేసిన కొన్ని హాట్ కామెంట్స్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయ్. ముఖ్యంగా ముంబై అండర్ వరల్డ్ ఒకప్పుడు బాలీవుడ్‌ను ఎలా శాసించిందో వివరిస్తూ చెప్పిన తీరు నెట్టింట్లో మంటలు పెడుతున్నాయ్.

సెలబ్రిటీలనే ఎందుకు టార్గెట్

Advertisement

అసలు అండర్ వరల్డ్ పనితీరు ఎలా ఉంటుంది, వాళ్ళు సెలబ్రిటీలనే ఎందుకు టార్గెట్ చేస్తారు అనే అంశాలపై వర్మ తనదైన శైలిలో విశ్లేషిస్తూ చెప్పుకొచ్చాడు వర్మ. ఒకరిని చంపితే పది మంది భయపడతారనేది మాఫియా వాళ్ళు నమ్మే బేసిక్ ఫార్ములా అని అందుకే వారు గుల్షన్ కుమార్ లేదా రాకేశ్ రోషన్ వంటి పెద్ద తలకాయలను టార్గెట్ చేస్తారని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

హృతిక్ రోషన్ సూపర్ స్టార్‌గా మారినప్పుడు

Advertisement

అండర్ వరల్డ్ డాన్‌లకు కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదని, తమ మాటే నెగ్గి తీరాలని, అది జరగడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 2000వ సంవత్సరంలో ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హృతిక్ రోషన్ సూపర్ స్టార్‌గా మారినప్పుడు, అతని కాల్‌షీట్ల కోసం ఛోటా షకీల్ ముఠా రాకేశ్ రోషన్‌పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చిందని వర్మ గుర్తు చేశారు. విదేశీ నిధులతో నిర్మించే ప్రాజెక్టుల కోసం హృతిక్ డేట్స్ అడిగినప్పుడు రాకేశ్ రోషన్ వద్దని చెప్పడం ఆయనపై మర్డర్ అటెంప్ట్ జరగడానికి ప్రధాన కారణమని ఆర్జీవీ బాంబు పేల్చారు. ఆ దాడిలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తీరుని కూడా కళ్ళకి కట్టినట్టు చెప్పుకొచ్చాడు ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్.

గుల్షన్ కుమార్ హత్య వెనుక

మరోవైపు టీ-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య వెనుక ఉన్న అసలు కుట్రను కూడా వర్మ బయటపెట్టారు. గుల్షన్ కుమార్ వ్యాపార సామ్రాజ్యం అపారంగా విస్తరించడం చూసి ఓర్వలేక కొందరు ప్రత్యర్థులు అండర్ వరల్డ్ సాయం తీసుకున్నారని, అబూ సలేం వంటి గ్యాంగ్‌స్టర్లు తమ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోవాలని ఈ దారుణానికి పాల్పడ్డారని ఆయన విశ్లేషించారు.

పెద్ద పెద్ద నిర్మాతలు, హీరోలు ఒక్కసారిగా భయంతో 

మాఫియా చేసిన భారీ వసూళ్ల డిమాండ్లకు గుల్షన్ కుమార్ తలవంచకపోవడం వారి కోపానికి కారణమైందని వర్మ తెలిపారు. ఈ హత్య వార్త తెలిసినప్పుడు తాను నిర్మాత జాము సుగంధ్ ఇంట్లో ఉన్నానని, ఆ వార్త వినగానే అక్కడున్న పెద్ద పెద్ద నిర్మాతలు, హీరోలు ఒక్కసారిగా వణికిపోయారని ఆనాటి భయానక వాతావరణాన్ని గుర్తు చేసుకున్నారు వర్మ. అప్పట్లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర హీరోలను కూడా మాఫియా తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూసేదని, ఎవరైనా ఎదురుతిరిగితే వారిని భయపెట్టడానికి ఇలాంటి దాడులు చేసేవారని ఆయన పేర్కొన్నారు.

తాను తీసిన ‘సత్య’, ‘కంపెనీ’ వంటి చిత్రాలు ఇలాంటి వాస్తవ పరిస్థితుల ఆధారంగానే తెరకెక్కాయని, నేడు బాలీవుడ్‌లో అండర్ వరల్డ్ ప్రభావం తగ్గినా, ఆనాడు జరిగిన రక్తపాతం తన సినిమాలకు మోటివ్ ఫోర్స్ అయ్యాయని ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పాడు వర్మ.

also read:పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది? సడన్ సర్జరీ వెనుక అసలు నిజాలివే!

Related News

RAW NTR సంచలన నిర్ణయం.. సంస్థ మూసివేత!

సీజేపీ ఉద్యమం.. విద్యార్థులకు అండగా ప్రముఖ సెలబ్రిటీలు!

శ్రీవారి సన్నిధిలో మరో వివాదం.. పెద్ది పోస్టర్ తో మహిళా హల్ చల్!

ధురంధర్ నటి ఆయేషా ఖాన్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

ఇండియాలో 450కి పైగా షోలు.. 59దేశాలలో స్క్రీనింగ్.. కృతజ్ఞతలు చెప్పిన డైరెక్టర్!

‘ది ఒడిస్సీ’లో ధనుష్ మిస్ ..అసలు కారణం ఇదే!

చమ్మక్ చంద్ర మగాడు అనే విషయం కూడా….అసలు విషయం చెప్పేసిన జబర్దస్త్ సత్యశ్రీ

గబ్బర్ సింగ్ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమంటున్న వైద్యులు!

Big Stories

Advertisement
×