E-Paper
Advertisement

Air India Express: టేకాఫ్ అవ్వగానే విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం

Air India Express: టేకాఫ్ అవ్వగానే విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం
Advertisement

Air India Express: ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. అబుదబీ నుంచి కాలికట్‌కు వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి అబుదబీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

శుక్రవారం ఉదయం అబుదబీ నుంచి కాలికట్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయి 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్నవారికి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనలకు గురయ్యారు. అయితే ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ తిరిగి విమానాన్ని అబుదబీలో ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని ఎయిరిండియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. తిరిగి ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్లు వివరించింది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×